News December 6, 2025

ఇండిగో.. రిఫండ్ చేస్తే సరిపోతుందా?

image

ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో వేలమంది ఇబ్బంది పడ్డారు. CEO సారీ కూడా చెప్పారు. టికెట్ డబ్బు రిఫండ్ చేస్తామన్నారు. చాలామంది జర్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో వాళ్లు ముందుగానే బుక్ చేసుకున్న హోటల్స్ రిఫండ్ చేస్తాయో లేదో తెలీదు. వేరే ఫ్లైట్స్‌కి వెళ్లిన వాళ్లు రూ.7 వేల టికెట్‌ని రూ.50 వేలకు కొన్నారు. ఇలా ఏదోలా ప్రయాణికులు నష్టపోయారు. మరి ఇండిగో కేవలం టికెట్ డబ్బు రిఫండ్ చేస్తే సరిపోతుందా? COMMENT.

Similar News

News March 7, 2026

నటుడు మురళీధర్ భార్య కన్నుమూత

image

ప్రముఖ టాలీవుడ్ నటుడు మురళీధర్ గౌడ్ భార్య శశికళ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన మురళీధర్ రిటైర్మెంట్ తర్వాత నటనపై ఆసక్తితో సినిమా ప్రయత్నాలు చేశారు. రంగ స్థలం, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, బలగం, మ్యాడ్, మేం ఫేమస్ తదితర చిత్రాలతో గుర్తింపు పొందారు.

News March 7, 2026

వామ్మో ఎండలు.. 40 డిగ్రీలు దాటేసిన టెంపరేచర్!

image

TG: మార్చి తొలి వారంలోనే ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇవాళ ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో 40-41 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైనట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. మార్చి 16 తర్వాత అకాల వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాబోయే 3 రోజులు పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు (సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా) నమోదవుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది.

News March 6, 2026

ఇది నిజంగా ‘బంగారు బాతు’

image

‘బంగారు బాతు గుడ్డు’ కథ అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో దురాశపరుడైన యజమాని దాన్ని చంపి నిరాశకు లోనవుతాడు. కానీ చైనాలోని గ్రామంలో ఓ వ్యక్తికి బాతు చనిపోతూ కనక వర్షం కురిపించింది. మాంసం కోసం కోస్తుండగా కడుపులో 10గ్రా. బంగారం బయటపడింది. ఆ ఏరియాలో గోల్డ్ నిల్వలకు పేరున్న నది ఉండేదని నమ్మకం. దాని ఒడ్డునే తిరిగే ఈ బాతు బురద కలిసిన కీటకాలను తినడంతో కడుపులోకి పసిడి చేరి ఉండొచ్చని అతను భావిస్తున్నాడు.