News February 10, 2025
ఇండియన్ ఐడిల్‌లో ADB జిల్లా యువతి ప్రతిభ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739113953698_20476851-normal-WIFI.webp)
ఇండియన్ ఐడిల్ తో పాటు జీ తెలుగు వారు నిర్వహించిన సరిగమ సూపర్ సింగర్స్ ఫైనల్ పోటీల్లో ఆదిలాబాద్ యువతి మొదటి స్థానంలో నిలిచారు. అదిలాబాద్ భుక్తాపూర్ కాలనీకి చెందిన యువతి అభిజ్ఞ ఆదివారం జరిగిన ఫైనల్లో మొదటి స్థానంలో నిలిచి సత్తాచాటారు. దీంతో కౌన్సిలర్ బండారి సతీష్, కాలనీ వాసులు యువతికి అభినందనలు తెలిపారు.
Similar News
News February 10, 2025
ఇచ్చోడ: 53 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739177548929_20476851-normal-WIFI.webp)
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 53 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రభుత్వ పాఠశాలలో 1972-73 10వ తరగతి బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 23 మంది విద్యార్థుల్లో 7గురు మరణించగా మిగిలిన 17 మంది పూర్వ విద్యార్థులు కలుసుకోవడం విశేషం. పాఠాలు చెప్పిన గురువులలో ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు పోశెట్టిని సన్మానించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
News February 10, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739160751181_16876240-normal-WIFI.webp)
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,910గా నిర్ణయించారు. శనివారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ, ప్రైవేటు ధరల్లో ఎలాంటి మార్పులేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
News February 10, 2025
ADB: జిల్లాలో MPTC, ZPTC స్థానాలు ఇవే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739163594906_51600738-normal-WIFI.webp)
ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లాలో మొత్తం 20 జడ్పీటీసీ, 166 ఎంపీటీసీ, సర్పంచ్ 473, వార్డులు 3,834 స్థానాలు ఉన్నాయి. ఈ నెల 11న పోలీంగ్ కేంద్రాల ముసాయిదా విడుదల కానుంది. కాగా ఈ నెల 15 లోపు ఎన్నికల సిబ్బందికి శిక్షణతో పాటు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు.