News January 19, 2026
ఇండియన్ క్రికెట్‌లో ఏం తప్పు జరుగుతోంది: CV ఆనంద్

న్యూజిలాండ్ చేతిలో భారత్ చారిత్రక ఓటమిని ఎదుర్కోవడంపై IPS CV సివి ఆనంద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు SMలో వైరల్‌గా మారాయి. ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు, అపారమైన ప్రతిభ, ఏడాదంతా టోర్నీలు ఉన్నప్పటికీ.. మనం వరుసగా అన్నీ ఓడిపోతున్నాం. అసలు ఇండియన్ క్రికెట్‌లో తప్పెక్కడ జరుగుతోంది? IPL డబ్బు ప్రభావం, ఆటగాళ్లలో టెంపర్మెంట్ తగ్గడం, పూర్ సెలక్షన్, కోచ్ గంభీరే దీనికి కారణమా?’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News February 15, 2026
మహిళల్లో గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలివే..

ప్రస్తుతకాలంలో పిల్లలు, ఆడ, మగ, వయసుతో సంబంధం లేకుండా అందరికీ హార్ట్‌అటాక్ వస్తోంది. అయితే మహిళలకు దీని ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. గుండెపోటు వచ్చే ముందు మహిళల్లో ఛాతీలో అసౌకర్యం, భుజాలు, వీపు, మెడ, దవడ ప్రాంతాల్లో నొప్పి, శ్వాస సరిగా ఆడకపోవడం, తలతిరగడం, చెమట ఎక్కువగా పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News February 15, 2026
INDvsPAK: టాస్ గెలిచిన పాక్.. భారత్ బ్యాటింగ్

T20WCలో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కొలంబో వేదికగా కాసేపట్లో INDతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లోనూ ఇరు జట్ల కెప్టెన్లు సూర్య, సల్మాన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.
IND: అభిషేక్, ఇషాన్, తిలక్, సూర్య, హార్దిక్, దూబే, రింకు, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా
PAK: అయూబ్, ఫర్హాన్, సల్మాన్, బాబర్, నవాజ్, షాదాబ్, ఫహీమ్, ఉస్మాన్, షాహీన్, అబ్రార్, తారిఖ్
News February 15, 2026
ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు.. PTI ఆందోళన

అవినీతి కేసుల్లో జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ <<19124142>>తీవ్ర అనారోగ్యంతో<<>> బాధపడుతున్నట్లు PTI పార్టీ తెలిపింది. దీంతో అధికారులు ఆయనను జైలు నుంచి రహస్యంగా ఆస్పత్రికి తరలిస్తున్నారని, ఇది ఇమ్రాన్ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని ఆరోపించింది. ఆయన ఫ్యామిలీ మెంబర్, పర్సనల్ డాక్టర్ల సమక్షంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఇమ్రాన్ ఆరోగ్యం గురించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరింది.


