News December 24, 2025
ఇండియన్ స్పేస్ సెక్టార్‌లో ఇది కీలక ముందడుగు: PM మోదీ

LVM3-M6 <<18655479>>మిషన్‌ను<<>> సక్సెస్ చేసిన ఇస్రోను PM మోదీ అభినందించారు. ‘ఇండియన్ స్పేస్ సెక్టార్‌లో ఇది కీలక ముందడుగు. గ్లోబల్ కమర్షియల్ లాంచ్ మార్కెట్‌లో మన పాత్రను బలోపేతం చేస్తుంది. గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్స్, కమర్షియల్ లాంచ్ సర్వీసుల విస్తరణ రాబోయే గగన్‌యాన్ వంటి మిషన్లకు బలమైన ఫౌండేషన్‌గా మారుతుంది. యువ శక్తితో మన స్పేస్ ప్రోగ్రామ్ డెవలప్ అవడంతో పాటు ఎఫెక్టివ్ అవుతోంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 25, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.320 పెరిగి రూ.1,39,250కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 ఎగబాకి రూ.1,27,650 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.2,45,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 25, 2025
క్రెడిట్ వార్.. రాహుల్‌కు కేంద్ర మంత్రి థాంక్స్

బెంగళూరులోని ‘ఫాక్స్‌కాన్’లో 30K మంది కార్మికుల నియామకంపై INC, BJP మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. జాబ్ క్రియేషన్‌కు KA ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందని LoP రాహుల్ ట్వీట్ చేయగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ‘మోదీ మేక్ ఇన్ ఇండియా విజయవంతమైందని గుర్తించినందుకు థాంక్స్’ అని రిప్లై ఇచ్చారు. ఇరువురూ ఇలాంటి SM పోస్టులపై కాకుండా దేశంలో మరిన్ని ఉద్యోగాల కల్పనకు కృషిచేయాలని నెటిజన్లు కోరుతున్నారు.
News December 25, 2025
IBPS RRB PO పోస్టుల ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

IBPS ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 3,928 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఆన్సర్ కీని విడుదల చేసింది. స్కోరు కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు https://www.ibps.in/లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నవంబర్ 22, 23 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.


