News December 13, 2025

ఇండియాకు కోహ్లీ.. మెస్సీని కలవడానికేనా?

image

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇండియాకు చేరుకున్నారు. తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు. ‘గోట్ టూర్’లో భాగంగా భారత్‌లో ఉన్న మెస్సీని కోహ్లీ కలుస్తారని ప్రచారం జరుగుతోంది. రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫ్యాన్స్‌ను మెస్సీ కలవనున్నారు. ఈ సమయంలోనే ఇద్దరు దిగ్గజాలు మీట్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత కోహ్లీ <<18500552>>లండన్‌<<>>కు వెళ్లడం తెలిసిందే.

Similar News

News December 14, 2025

BIG BREAKING: సంక్రాంతి స్పెషల్.. టికెట్లు విడుదల

image

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్. రద్దీ దృష్ట్యా JAN 8 నుంచి 20 వరకు నడిపే ప్రత్యేక రైళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. త్వరగా టికెట్లు అయిపోయే అవకాశం ఉన్నందున వెంటనే IRCTC వెబ్‌సైట్, యాప్‌లో రిజర్వేషన్ చేసుకోండి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా APలోని ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాలకు ఈ 41 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఆ జాబితా కోసం పైన ఫొటోలను స్వైప్ చేయండి.

News December 14, 2025

ఆ నియమం ఈ పుష్పానికి వర్తించదు

image

మన శాస్త్రాల ప్రకారం.. పాత పూలను దేవుడికి సమర్పించరు. అయితే ఈ నియమం తామరకు వర్తించదని పురోహితులు అంటున్నారు. తామర పువ్వును ఓసారి దేవునికి సమర్పించిన తరువాత కూడా, దాన్ని మళ్లీ శుభ్రం చేసి తిరిగి పూజలో ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఒక తామర పువ్వును ఇలా ఐదు రోజుల వరకు పూజకు సమర్పించవచ్చు అని వివరిస్తున్నారు. తామర పువ్వుకు ఉన్న ఈ ప్రత్యేకత వల్ల దీనికి పూజలో విశిష్ట స్థానం ఉంది.

News December 14, 2025

ట్విన్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఇబ్బందులివే..

image

ఒకే కాన్పులో ట్విన్స్ పుడితే బావుంటుందని అందరూ భావిస్తారు. కానీ దీనివల్ల పెరినాటల్ అనారోగ్యం, మరణాల ప్రమాదం, అలాగే నెలలు నిండకుండానే ప్రసవం వంటి ప్రసూతి సమస్యలకు దారి తీస్తాయంటున్నారు నిపుణులు. అయితే సరైన శ్రద్ధ, సంరక్షణతో ఆరోగ్యకరమైన ట్విన్‌ ప్రెగ్నెన్సీ పొందడం సాధ్యమవుతుంది. ఈ సమయంలో మెటర్నిటీ బెల్ట్, బెల్లీ బ్యాండ్స్ వాడాలి. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి.