News November 20, 2025

ఇండియాకు 100 US జావెలిన్ మిస్సైళ్లు

image

దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. $92.8M విలువైన 100 FGM-148 జావెలిన్ క్షిపణులను, ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్ అమ్మకానికి US ఆమోదం తెలిపింది. ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేలా భారత రక్షణ రంగం పటిష్ఠం అవుతుందని US డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ వివరించింది. మిస్సైల్స్‌తో పాటు లాంచర్ యూనిట్లు, ఫిరంగి గుండ్లు అందుతాయి. మిస్సైల్‌ను భుజంపై మోస్తూ ఇద్దరు ఆపరేట్ చేయొచ్చు.

Similar News

News November 22, 2025

నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి

image

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ సత్యసాయి(D) పుట్టపర్తికి వెళ్లనున్నారు. ప్రశాంతి నిలయంలో జరిగే సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉ.11 గంటలకు ముర్ము అక్కడికి చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టులో CM చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. మ.3.40గంటలకు రాధాకృష్ణన్ చేరుకుంటారు. సత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవానికి రాధాకృష్ణన్, చంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

News November 22, 2025

పెళ్లి చేసుకుంటున్నారా? శ్రీవారి కానుక అందుకోండిలా..

image

పెళ్లి చేసుకునేవారికి TTD ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. నూతన దంపతులకు వేంకటేశ్వరస్వామి ఆశీర్వచనంతో కూడిన మహా ప్రసాదం, కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలను ఉచితంగా పంపిస్తుంది. అందుకోసం వివాహ తొలి శుభలేఖను కార్యనిర్వహణాధికారి, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, తిరుపతి చిరునామాకు పంపితే చాలు. వివాహానికి ఓ నెల ముందు పత్రిక పంపితే, స్వామివారి ప్రసాదం వివాహ సమయానికి అందుతుంది.