News November 19, 2025
ఇండియా ఘన విజయం

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ జట్టు రెండో విజయం సాధించింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 20 ఓవర్లలో 135-7 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. ఓపెనర్లు వైభవ్(12), ప్రియాన్ష్ ఆర్య(10) నిరాశపరిచినా, హర్ష్ దూబే(53*), నమన్ ధిర్(30) రాణించారు. దీంతో ఇండియా-ఏ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
Similar News
News March 29, 2026
భారీగా తగ్గిన చికెన్ ధరలు

గత వారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.370-380 పలకగా ఇప్పుడు రూ.270కి తగ్గింది. వరంగల్‌లోనూ అదే ధర ఉంది. ఏపీలోని విజయవాడలో రూ.340, రాజమండ్రిలో 300, అమలాపురంలో రూ.300-350 పలుకుతోంది. అటు ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు. మరి మీ ఏరియాలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.
News March 29, 2026
మీ ఇంట్లో సూర్యుడి విగ్రహం ఉందా?

చాలామంది ఇళ్లల్లో దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. కానీ సూర్యుడి విగ్రహాన్ని మాత్రం పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే సూర్యుడు మనకు రోజూ ప్రత్యక్ష దైవంగా కనిపిస్తాడు. ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆ భాస్కరుడిని చూస్తూ నమస్కరించుకోవడం, అర్ఘ్యం వదలడం శ్రేష్ఠం. ప్రకృతిలోనే దైవాన్ని దర్శించుకునే అవకాశం ఉన్నప్పుడు, విగ్రహ రూపం కంటే నేరుగా సూర్యుడిని ఆరాధించడమే అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది.
News March 29, 2026
పశువుల్లో పిడుదల సమస్య నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పిడుదులు ఎక్కువగా పెంటకుప్పలలో, చీకటి ప్రదేశాలలో, గోడ పగుళ్లలో గుడ్లు పెడతాయి. అందుకే పశుశాలలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పశుశాలలకు దగ్గరగా పెంట కుప్పలు లేకుండా చూసుకోవాలి. వాటిని బాగా, గాలి, వెలుతురు వచ్చే విధంగా నిర్మించుకోవాలి. వీటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవాలి. పిడుదుల సమస్యను గుర్తిస్తే వెటర్నరీ డాక్టరుకు చూపించి ఆలస్యం చేయకుండా నివారణ చర్యలు చేపట్టాలి.


