News September 6, 2025

ఇండియా నుంచి ఏడుగురు.. అందులో మహబూబాబాద్ టీచర్

image

అమెరికాలోని FTEA ప్రోగ్రామ్‌కు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఇండియా నుంచి ఏడుగురు ఎంపికవగా అందులో ఒకరు MHBD జిల్లా మరిపెడ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు సోన్‌బన్ ఆంథోనీ డిసౌజా ఎంపికైనట్లు ప్రిన్సిపల్ అక్తర్ ఈరోజు తెలిపారు. TGT (ఇంగ్లిష్) టీచర్ సోన్‌బన్ నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో ఫాల్-2025 ఫుల్‌బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అండ్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారన్నారు.

Similar News

News September 6, 2025

HYD: నంది వాహనం ఎక్కిన ‘శివ’పుత్రుడు

image

వినాయక నిమజ్జనోత్సవంలో ‘శివ’పుత్రులు దర్శనమిచ్చారు. అవును.. హిమాయత్‌నగర్‌లో ఈ దృశ్యం భక్తులను కనువిందు చేసింది. శనివారం ట్యాంక్‌బండ్‌కు ఎడ్లబండి మీద ఓ వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొచ్చారు. రథసారథిగా శివుడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంది వాహనం ఎక్కి గణపయ్య వస్తున్నాడు అంటూ భక్తులు పరవశించిపోయారు. ఈ వినూత్న ఆలోచన బాగుంది కదూ.

KMR: ఎస్పీ రాజేశ్ చంద్ర పర్యవేక్షణలో గణేష్ నిమజ్జనం

image

కామారెడ్డి జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శోభాయాత్ర ప్రారంభం నుంచి టెక్రియాల్ చెరువు వరకు భద్రతా ఏర్పాట్లను SP రాజేశ్ చంద్ర స్వయంగా నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జనాలు, శోభాయాత్రలకు డ్రోన్ కెమెరాల సహాయంతో సమన్వయం చేశారు. ప్రజల సహకారంతో శాంతిభద్రతల మధ్య ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని SP తెలిపారు.