News February 24, 2026

ఇండియా-బాల్టిక్స్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ అధ్యక్షడిగా మిథున్ రెడ్డి

image

18వ లోక్ సభలో ఇండియా-బాల్టిక్స్ పార్లమెంటరీ ఫ్రెండ్లిప్ గ్రూప్ అధ్యక్షుడిగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఈయన్ను భారత పార్లమెంటు స్పీకర్ ఓంబిర్లా 2026లో ఏర్పాటు చేసిన పార్లమెంట్‌రీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సిస్టంలో ఒకరిగా బాల్టిక్ దేశాల గ్రూప్‌కు నామినేట్ చేశారు. అంటే ఆయన బాల్టిక్ ప్రాంతం (Estonia, Latvia, Lithuania)తో సంబంధాలు బలోపేతం చేసేందుకు కషి చేస్తారు.

Similar News

News February 25, 2026

నెల్లూరు: 27న ట్రై స్కూటీల కోసం ఇంటర్వ్యూలు

image

ఈనెల 27న ట్రై స్కూటీల మంజూరుకు విభిన్న ప్రతిభావంతులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా మేనేజర్ మహమ్మద్ అయూబ్ తెలిపారు. జిల్లాలో ట్రై స్కూటర్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. నెల్లూరులోని JC ఛాంబర్‌లో ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

News February 25, 2026

జడ్చర్ల: అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రం తారుమారు

image

జడ్చర్ల పట్టణంలోని ఓ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థికి సంస్కృతం సబ్జెక్టు పేపర్‌కు బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. పరీక్ష తొందరలో విద్యార్థి తనకు తోచిన జవాబులు రాశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి కళాశాలకు వెళ్లి అధికారులను ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 25, 2026

కడప జిల్లాలో పలువురు ఆర్డీవోల బదిలీ

image

కడప జిల్లాలో పనిచేస్తున్న పలువురు గ్రూప్-1 అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ అవిన్, జమ్మలమడుగు ఆర్డీవో ఆదిమూలం సాయిశ్రీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.