News February 26, 2025

ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో అతిరుద్ర మహా యజ్ఞానికి చోటు 

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఈనెల 14 నుంచి 25 వరకు జరిగిన అతిరుద్ర మహా యజ్ఞం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. దాదాపు 83 దేశాలకు చెందిన శ్రీ సత్యసాయి భక్తులు లక్షలాదిమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా అతిరుద్ర మహా యజ్ఞాన్ని తిలకించారని నిర్వాహకులు తెలిపారు.  సత్య సాయి ట్రస్టు సభ్యులకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిన పుస్తకాన్ని నిర్వాహకులు అందజేశారు.

Similar News

News December 27, 2025

డిసెంబర్ 27: చరిత్రలో ఈరోజు

image

☛ 1822: రేబిస్ టీకా సృష్టికర్త లూయీ పాశ్చర్ జననం
☛ 1911: కలకత్తా కాంగ్రెస్ సభలో తొలిసారిగా జనగణమన ఆలాపన
☛ 1939: టర్కీలో భూకంపం, 32 వేలమంది మృతి
☛ 1945: అంతర్జాతీయ ద్రవ్య నిధి స్థాపన
☛ 1965: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(ఫొటోలో) జననం
☛ 2007: పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య
☛ 2009: నటుడు నర్రా వెంకటేశ్వరరావు కన్నుమూత

News December 27, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 27, 2025

పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలి: పార్వతీపురం కలెక్టర్

image

విద్యార్థులను కేవలం ఉత్తీర్ణులుగా చేయడం మాత్రమే కాకుండా, వారిని సమాజానికి పనికొచ్చే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల ప్రధాన లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హితవుపలికారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కళాశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యాబోధనలో ఉపాధ్యాయులు అనుసరించాల్సిన కీలక మార్పులపై పలు సూచనలు చేశారు.