News October 31, 2025
ఇండియా విన్.. TDPపై YCP MLA సెటైర్లు

AP: ఉమెన్స్ వరల్డ్ కప్‌లో AUSను టీమ్ ఇండియా ఓడించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. యర్రగొండపాలెం YCP MLA చంద్రశేఖర్ మహిళల జట్టుకు శుభాకాంక్షలు చెబుతూనే TDPపై సెటైర్లు వేశారు. “ఎల్లో జట్టును మట్టికరిపించిన ఉమెన్ ఇన్ బ్లూకు శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ‘డర్టీ ఎల్లో జట్టును’ కూడా రాజకీయ సమాధి చేయడానికి ‘మెన్ ఇన్ బ్లూ’ సిద్ధం” అని ట్వీట్ చేశారు. MLA తీరుపై TDP ఫాలోవర్స్ మండిపడుతున్నారు.
Similar News
News October 31, 2025
MGB, NDAలకు కీలకంగా మారిన ‘బిహార్ వార్’

బిహార్‌లో ప్రధాన కూటములు పోటాపోటీ హామీలు గుప్పించాయి. ‘తేజస్వీ ప్రాణ్’ పేరిట MGB ‘సంపూర్ణ బిహార్ కా సంపూర్ణ పరివర్తన్’ నినాదంతో స్టేట్ రూపురేఖలు మారుస్తామంది. గత ప్రభుత్వ అవినీతిని నిర్మూలిస్తామని చెప్పింది. NDA ‘సంకల్ప్ పాత్ర్’ పేరుతో రాష్ట్రాన్ని పారిశ్రామిక, విద్యా కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చింది. ఈ ఎన్నికలు అక్కడి పాలనా పగ్గాల కోసమే కాక హిందీ బెల్టులో పాగా వేసేందుకు కీలకం కావడమే కారణం.
News October 31, 2025
ఇతిహాసాలు క్విజ్ – 52 సమాధానాలు

1. జనకుని భార్య పేరు ‘సునయన’.
2. మహాభారతంలో రాధేయుడు ‘కృష్ణుడు’.
3. దత్తాత్రేయుడికి ‘24’ మంది గురువులు ఉన్నారు.
4. దేవతలకు వైద్యుడు ‘ధన్వంతరి’.
5. సముద్ర మథనంలో లక్ష్మీదేవికి ముందు పుట్టిన ఆమె అక్క పేరు ‘అలక్ష్మి’. ఆమెనే ‘జ్యేష్టా దేవి’ అని కూడా అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>> 
News October 31, 2025
కోడలి జీతంలో మామకు రూ.20వేలు: రాజస్థాన్ హైకోర్టు

కుటుంబ పోషణ బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకున్న కోడలికి రాజస్థాన్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. భర్త చనిపోవడంతో అతడి ఉద్యోగం భార్యకు లభించింది. అయితే ఆమె తమ బాగోగులు చూసుకోవట్లేదని మామ భగవాన్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కారుణ్య నియామకం మొత్తం కుటుంబానికి చెందుతుందని కోడలు శశి కుమారి జీతం నుంచి ప్రతినెలా రూ.20వేలు తీసి సింగ్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి.


