News September 2, 2025
‘ఇండియా స్కిల్స్ పోటీకి దరఖాస్తు చేసుకోవాలి’

ఈనెల 30లోపు ఇండియా స్కిల్స్ పోటీ ఏపీ-2025కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తూ.గో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వీడీజీ మురళి మంగలవారం కోరారు. ఈ పోటీల్లో 63 స్కిల్ ట్రేడ్స్‌లో యువత తమ ప్రతిభను ప్రదర్శించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వరల్డ్ స్కిల్స్ 2025లో పోటీపడే అవకాశం పొందవచ్చారు. ఆసక్తి ఉన్న యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News September 3, 2025
జిల్లాలో అవసరానికి తగిన యూరియా సరఫరా: కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్-2025 సీజన్‌కు అవసరమైన ఎరువుల సరఫరా సమయానుకూలంగా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాకు అవసరమైన 26,000 మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటివరకు 22,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు వివరించారు. దుకాణదారులు యూరియా, ఎరువులను అధిక ధరకు విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 3, 2025
వార్డు సచివాలయాల పనితీరుపై పర్యవేక్షణ ఉండాలి: కలెక్టర్

వార్డు సచివాలయాల పనితీరును నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నోడల్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో చెత్త సేకరణతో పాటు రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటిపై వచ్చే సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా ఐవీఆర్ఎస్ కాల్స్‌లో వచ్చే ఫిర్యాదులపై స్పందించాలని పేర్కొన్నారు.
News September 2, 2025
కృష్ణునిపాలెంలో కోడి కత్తులతో దాడి.. నలుగురి అరెస్టు

గోకవరం మండలం కృష్ణునిపాలెంలోని పెట్రోల్ బంకు వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా మంగళవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. ఈ ఘర్షణలో గోకవరానికి చెందిన గేదెల శివ, రాయి అచ్చారావు, కామేష్, మహిపాల దుర్గాప్రసాద్ ఓసీ బంధ గ్రామానికి చెందిన జ్యోతి, భరత్‌పై కోడి కత్తులతో దాడిచేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుల కోసం గాలించి నలుగురిని అరెస్ట్ చేశామన్నారు.