News February 1, 2025
ఇండోనేషియా అమ్మాయితో గుండ్రాంపల్లి యువకుడు పెళ్లి

చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన అబ్బాయి ఇండోనేషియాకు చెందిన అమ్మాయి హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సీమ సాలయ్య-యాదమ్మల కుమారుడు నాగరాజు హైదరాబాద్లోని సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇండోనేషియాకి చెందిన రిక్కి సన్డా సెఫిట్రి అదే కంపెనీలో పనిచేస్తోంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఇటీవల బంధువులు సమక్షంలో ఒక్కటయ్యారు.
Similar News
News February 22, 2026
HYD: అంగన్వాడీ.. ఊపిరాడని పనులతో ఉక్కిరిబిక్కిరి

ఊపిరిసలపని పనులతో అంగన్వాడీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. NHTS, పోషణ ట్రాకర్ యాప్‌లో గ్రోత్ మానిటరింగ్, డైలీ హాజరు, సర్వేలు, గృహ సందర్శనలు, MAM, SAM పిల్లలు, గర్భిణులు, బాలింతల మెడికల్ రికార్డులు, THR ఫొటోలు, ABHA, APAAR, CBE ఈవెంట్లు, ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశాలతో పాటు అదనంగా 10 రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. BLO డ్యూటీ, పల్స్ పోలియోతో పాటు పోషకాహార పంపిణీ, ప్రీ స్కూల్ బోధనతో సతమతమవుతున్నారు.
News February 22, 2026
బుల్లెట్ తగిలినా తగ్గలేదు!

జమ్మూకశ్మీర్ కిష్త్వార్ జిల్లాలో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో టైసన్ అనే శునకం ధైర్యసాహసాలు ప్రదర్శించింది. దాని సహాయంతో పోలీసులు, భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రమూకలను గుర్తించగలిగారు. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో టైసన్ గాయపడింది. అయినా ఓర్పుతో మిషన్ పూర్తయ్యేవరకు సేవలు అందించింది. గాయపడిన శునకాన్ని హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
News February 22, 2026
రేపు టీజీ పీజీఈసెట్- 2026 నోటిఫికేషన్

రాష్ట్రంలోని ఎం.టెక్, ఎం.ఫార్మసీ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఎన్టీయూ నేతృత్వంలో TG PGECET- 2026 నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. ఫిబ్రవరి 27న ఉ.11:30 గంటల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని కన్వీనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://pgecet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.


