News July 5, 2025
ఇండ్ల నిర్మాణానికి రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్లు, నిర్మాణ ప్రగతిపై రెవెన్యూ, గృహ నిర్మాణ, పంచాయతీ రాజ్ అధికారులతో కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇండ్ల నిర్మాణానికి మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని డీఆర్డీఓకు సూచించారు. జిల్లాలో మొత్తం 4,779 ఇండ్లు మంజూరయ్యాయని, 1558 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. 2,794 ఇళ్ల మంజూరు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
Similar News
News July 5, 2025
నేడు కామారెడ్డికి ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం

ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య, బృందం సభ్యులు శనివారం కామారెడ్డికి రానున్నట్లు ఎస్సీ డెవలప్‌మెంట్ అధికారి వెంకటేశ్ తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం కలెక్టరేట్లో నిర్వహించే సమావేశంలో PCR యాక్ట్, POA యాక్ట్, ల్యాండ్, సర్వీస్ విషయాలపై సమీక్షిస్తారని ఆయన తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి సమస్యలు ఉన్న కమిషన్ ఛైర్మన్‌కు అర్జీ పెట్టుకోవచ్చన్నారు.
News July 5, 2025
మహబూబ్‌నగర్‌లో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాడే వక్ర బుద్ధితో ఆలోచించాడు.. ఉన్నతమైన స్థానంలో ఉండి సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. MBNR శివారులోని ధర్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఫిజిక్స్ టీచర్ రామ్మోహన్ కొన్ని రోజులుగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేశారు.
News July 5, 2025
‘కొత్తూరులో రూ.5.35 కోట్లతో మెగా పార్క్’

అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామంలో రూ.5.35 కోట్లతో మెగా పార్క్ నిర్మించనున్నారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అధ్యక్షతన నిర్వహించిన బోర్డు సమావేశం తీర్మానించింది. 5.68 ఎకరాల విస్తీర్ణంలో పార్క్ నిర్మిస్తారు. అందులో పిల్లల కోసం ఆటస్థలం, యోగాసనాలు వేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. బాస్కెట్ బాల్, బ్యాట్మింటన్, టెన్నీస్, ఫుట్ బాల్ కోర్టులు నిర్మిస్తారు.