News November 1, 2025
ఇంతమంది వస్తారని అనుకోలేదు: హరిముకుంద్

AP: శ్రీకాకుళం కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాటపై నిర్వాహకుడు 95 ఏళ్ల హరిముకుంద్ పండా స్పందించారు. ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదని చెప్పారు. భక్తులు విపరీతంగా వచ్చారని, గతంలో ఎప్పుడూ ఇంతమంది రాలేదని తెలిపారు. కాగా గతంలో తిరుమలకు వెళ్లిన హరిముకుంద్‌కు సంతృప్తిగా స్వామివారి దర్శనం కలగలేదు. దీంతో తనకు గల 50 ఎకరాల్లో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించారు.
Similar News
News February 22, 2026
T20WC: శ్రీలంకపై ఇంగ్లండ్ స్కోర్ ఎంతంటే?

పల్లెకెలె: భారీ హిట్టర్లున్న ఇంగ్లండ్ జట్టును శ్రీలంక తక్కువ పరుగులకే కట్టడి చేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 రన్స్ చేసింది. ఓపెనర్ సాల్ట్ 62 పరుగులతో రాణించారు. చివర్లో విల్ జాక్స్(21) వేగంగా రన్స్ రాబట్టారు. వెల్లలాగే 3 వికెట్లతో సత్తా చాటారు. శ్రీలంక విజయ లక్ష్యం 147 పరుగులు.
News February 22, 2026
లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకే సమస్య లేదా: అంబటి

AP: వైసీపీ చీఫ్ జగన్‌పై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకే సమస్య లేదా? అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న CM చంద్రబాబు తిరుమల శ్రీవారి ఆగ్రహానికి గురవ్వక తప్పదని హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంపై సీబీఐ కమిటీ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిందని, అయినా దానిపై వక్రభాష్యాలు ఎందుకని నిలదీశారు. ప్రజలకు వాస్తవమేంటో తెలుసని చెప్పారు.
News February 22, 2026
తీవ్ర విషాదం.. పెళ్లికి ముందురోజే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఒకే రోజు ఇద్దరు కూతుళ్ల పెళ్లి వైభవంగా చేసి సంతోషించాలనుకున్న తల్లిదండ్రులకు విషాదం ఎదురైంది. శనివారం వివాహం జరగాల్సి ఉండగా ముందు రోజు రాత్రి అక్కాచెల్లెళ్లు శోభ(25), విమల(23) విషం తాగారు. బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత పోలీసులు బాడీలను ఫ్యామిలీకి అప్పగించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.


