News October 10, 2025

ఇంత నిర్లక్ష్యం దేనికి ఈశ్వరా..?

image

శ్రీకాళహస్తి ఆలయంలో మరోసారి భద్రత వైఫల్యం వెలుగు చూసింది. గురువారం తమిళనాడుకు చెందిన భక్తులు రూ.750 రాహు–కేతు పూజ అనంతరం వాయిలింగేశ్వరుడి దర్శనం ముగించుకుని నాగశిలను ఆలయంలో ప్రతిష్ఠాపన చేసే ప్రయత్నం చేశారు. ఆలయ మహాద్వారం వద్ద హోమ్ గార్డులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. భక్తులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

Similar News

News October 11, 2025

కాకినాడ: స్కిల్ డెవలప్మెంట్ అధికారుల తీరుపై ఎంపీ ఆగ్రహం

image

నిరుద్యోగుల ఉపాధి అవకాశాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలో ఆయన దీనిపై మాట్లాడారు. జిల్లాలో ఏడు స్కిల్ హబ్ సెంటర్ల ద్వారా ఈ ఏడాది 631 మంది శిక్షణ పొందారని, 201 మందికే ఉపాధి అవకాశాలు కల్పించారని అసహనం వ్యక్తం చేశారు.

News October 11, 2025

యథావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు -DCHS ప్రియాంక

image

తూ.గో జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పరిధిలో ఉచిత వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని DCHS ప్రియాంక తెలిపారు. సమ్మె ప్రభావం కారణంగా జిల్లా ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకావొద్దన్నారు. సాధారణంగా ఉచిత వైద్య సేవలను పొందవచ్చునని తెలిపారు. రోగులకు ప్రతి విభాగంలో ఉచిత వైద్య సేవలు అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యలుంటే 9281068129, 9281068159 నంబర్లలో సంప్రదించాలన్నారు.

News October 11, 2025

2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: జేసీ

image

విజయవాడ: జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆమె జిల్లాలోని రైస్ మిల్లర్లకు, పౌర సరఫరాల శాఖ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ నెల 15వ తేదీలోపు బ్యాంక్ గ్యారంటీలు సమర్పించాలన్నారు. గోనె సంచులను కొనుగోలు కేంద్రాలకు పంపించాలని మిల్లర్లకు సూచించారు.