News February 2, 2025
ఇందల్వాయి: కంటైనర్ మీద నుంచి వెళ్లడంతో ఒకరు మృతి
ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులో కంటైనర్ మీద నుంచి వెళ్లడంతో ఒకరు మృతి చెందారు. మెదక్ జిల్లాకు చెందిన బత్తుల నాగరాజు (32) ఆదివారం తన బైక్ పై కామారెడ్డి వైపు నుంచి నిజామాబాద్ వెళ్తుండగా చంద్రాయన్పల్లి వద్ద సర్వీస్ రోడ్డు పనులు జరుగుతుండంతో రోడ్డు పక్కన అడ్డంగా పెట్టిన మట్టి బ్యాగులు ఢీకొని నాగరాజు కింద పడ్డాడు. ఆయనపై నుంచి కంటైనర్ వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News February 2, 2025
NZB: కేంద్రంపై MLC కవిత ఫైర్
జనగణనపై నిజామాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని నిలదీశారు. జనగణన ఇంకెప్పుడు చేస్తారని ప్రశ్నించారు. జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందన్నారు. ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి అని పేర్కొంటూ జనగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
News February 2, 2025
NZB: పసుపు బోర్డుకు గుండు సున్నా: ఎమ్మెల్సీ కవిత
పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా కేటాయించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు తరహాలోనే పని చేసే స్పైసెస్ బోర్డు, టీ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డులకు నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుకు మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. నిజామాబాద్ రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
News February 2, 2025
NZB: ఉత్తరాది బడ్జెట్‌లా ఉంది: DCC అధ్యక్షుడు
కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఉత్తరాది బడ్జెట్‌లా ఉందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేసి ఆదాయం ఇచ్చే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేశారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వే లైన్‌కు పైసా ఇవ్వలేదని, గల్ఫ్ కార్మికుల కోసం పాలసీ ఏర్పాటు చేయలేదన్నారు.