News October 29, 2025
ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలకు తావు లేదు: కలెక్టర్

అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు. కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎం.తిరుపతిని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినందుకు విధుల నుంచి తొలగించారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతి సహించబోదని, మరెవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
Similar News
News October 30, 2025
అనకాపల్లి: నేడు కూడా కొనసాగనున్న పునరావాస కేంద్రాలు

మొంథా తుఫాన్ తీరం దాటినా పునరావాస కేంద్రాలు గురువారం కూడా కొనసాగుతాయని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జిల్లాలో 78 పునరావాస కేంద్రాల్లో 3,993 మంది ఆశ్రయం పొందుతున్నారు. కేంద్రాల్లో వీరికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు మండల స్థాయి అధికారులు ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు.
News October 30, 2025
ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ సౌకర్యాలు.. తొలుత కొడంగల్‌లో

TG: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వసతులు కల్పించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకోనుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొడంగల్‌లో చేపట్టనున్నారు. స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంటర్నెట్, లైబ్రరీలు, క్రీడా మైదానాలు వంటివి ఏర్పాటు చేస్తారు. టీచర్లు, స్టూడెంట్స్‌కు ID కార్డులు, 8-10th స్టూడెంట్స్‌కు IIT, NEET ఫౌండేషన్ మెటీరియల్ అందిస్తారు.
News October 30, 2025
తుపానుతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు: కలెక్టర్

ఏలూరు జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా కలిగిన ప్రాథమిక నష్టం అంచనాలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ఆదేశించారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదన్నారు. 4 పశువులు చనిపోయాయని, 18 ఇళ్లు దెబ్బతిన్నాయని, 9,298 ఎకరాలలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా గుర్తించామన్నారు. తుపాను నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు.


