News September 12, 2025
ఇందిరమ్మ ఇండ్ల ఫిర్యాదు కోసం కాల్ సెంటర్: జనగామ కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు, అలాగే లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న 1800 599 5991 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు. కాగా జనగామలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు.
Similar News
News September 12, 2025
గత ప్రభుత్వ పాలన అమరావతి నుంచే నడిచింది: సజ్జల

AP: రాజధానిలో ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ చాలు అని.. కొత్త కట్టడాలేమీ అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని, గత ప్రభుత్వ పాలన అక్కడి నుంచే నడిచిందని వివరించారు. విశాఖ నుంచి పాలన చేద్దామని జగన్ అనుకున్నారని, అయితే ఎన్నికలు రావడంతో అది కుదరలేదని చెప్పారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖతో పాటు అమరావతి కూడా అభివృద్ధి అయ్యేదని చెప్పారు.
News September 12, 2025
BREAKING.. KMR: బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ వాయిదా

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క చెప్పారు. శుక్రవారం మాచారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తిరిగి సభను నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
News September 12, 2025
రాజధానిలో ఎవరైనా ఇండస్ట్రీలు కడతారా: సజ్జల

రాజధానిలో ఎవరైనా ఇండస్ట్రీలు కడతారా అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి కోసం చేసిన రూ.లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారని ఆయన ప్రశ్నించారు. ‘కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకువచ్చి అయినా రాజధాని కడితే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ రూ.లక్ష కోట్లు ఇప్పటికే రాజధాని పేరుతో వృథా చేశారు. వైజాగ్, కర్నూలు, విజయవాడలో కూడా రాజధాని పెట్టొచ్చు’ అని సజ్జల వ్యాఖ్యానించారు.