News August 21, 2025
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ని పెంచాలి: నల్గొండ కలెక్టర్

నల్గొండ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై గృహ నిర్మాణ శాఖ అధికారులు, తహశీల్దార్లతో ఆమె సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని మండలాల ప్రత్యేక అధికారులు, గృహ నిర్మాణ ఇంజినీర్లు, ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రౌండింగ్ చేయాలన్నారు.
Similar News
News August 22, 2025
నల్గొండలో దిల్ ధార్ ఆటో డ్రైవర్

నల్గొండ పట్టణంలో నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్ బకరం నరసింహను పోలీసులు ఈరోజు అభినందించారు. తన ఆటోలో ప్రయాణికురాలు జార విడుచుకున్న ఖరీదైన సెల్‌ఫోన్‌ను గుర్తించి, వెంటనే టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ సైదులుకు అప్పగించారు. విచారణ అనంతరం ఎస్ఐ ఆ ఫోన్‌ను, బాధితురాలు అరుణకు అందజేశారు. డ్రైవర్ నరసింహ నిజాయతీని మెచ్చుకున్న ఎస్ఐ, సిబ్బంది ఫారూక్‌తో కలిసి ఆయనను సత్కరించారు.
News August 21, 2025
నల్గొండ: ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీ

సీజనల్ వ్యాధుల బారిన పడిన చిన్నపిల్లలకు సత్వర చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులను ఈరోజు ఆదేశించారు. అంతేకాక ఆయా వ్యాధులకు సంబంధించి వ్యాధి నివారణ మందులు ముందే సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గురువారం ఆమె ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి చిన్న పిల్లల వార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న మందులు, ఇతర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
News August 21, 2025
గుర్రంపోడు: కరెంట్ షాక్‌తో ఎనిమిది గొర్రెలు మృతి

కరెంట్ షాక్‌తో ఎనిమిది గొర్రెలు మృతిచెందిన ఘటన గుర్రంపోడు మండలం పిట్టలగూడెం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన బండారు వెంకటయ్య గొర్రెలను మేపేందుకు ఏఎమ్ఆర్పీ కాల్వ వద్దకు వెళ్లాడు. కాల్వలో అమర్చిన మోటారుకు విద్యుత్ సరఫరా అవుతుండడంతో అక్కడికి వెళ్లిన గొర్రెలకు విద్యుత్ షాక్ తగిలింది. ఎనిమిది గొర్రెలు మృతిచెందాయి. వీటి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు.