News September 20, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పురోగతి సాధించాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లాలో 10,775 ఇండ్లు మంజూరు కాగా 7,261 మార్కింగ్ చేయగా 2,569 బేస్మెంట్ స్థాయిలో 428 గోడల స్థాయిలో 165 స్లాబ్ దశలో ఉన్నాయని ఒక ఇల్లు పూర్తయిందనీ అధికారులు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ తదితరులున్నారు.

Similar News

News September 20, 2025

ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

image

వానాకాలంలో ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం జిల్లాలో 326 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 275 సన్నరకాలకు, 51 దొడ్డు రకాలకు ఉంటాయి. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ కొనుగోళ్లు జనవరి వరకు కొనసాగుతాయి. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, మెప్మాల ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

News September 20, 2025

ఇండియన్ల వద్దే 72శాతం H1B వీసాలు

image

అమెరికా ప్రభుత్వం జారీచేసే H1B వీసాలు అత్యధికంగా ఇండియన్ల వద్దే ఉన్నాయి. FY2022 వరకూ జారీచేసిన వాటిల్లో భారతీయుల వద్ద 72.6శాతం.. అంటే 3,20,791 వీసాలు ఉండటం గమనార్హం. ఆ తర్వాత చైనాకు చెందిన 55,038(12.5%) మంది వద్ద H1B వీసాలున్నాయి. అలాగే కెనడా వద్ద ఒక శాతం(4,235), సౌత్ కొరియా వద్ద 0.9శాతం(4,097) ఉండగా, ఫిలిప్పీన్స్ ప్రజలు 0.8శాతం (3,501) వీసాలు కలిగిఉన్నారు.

News September 20, 2025

మదనపల్లి: టార్పెంట్ ఆయిల్ తాగి రెండేళ్ల చిన్నారి మృతి

image

టార్పెంట్ ఆయిల్ తాగి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం మదనపల్లిలో జరిగింది. టూటౌన్ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని సైదాపేటకు చెందిన సాదియా రీలింగ్ పనిచేసేందుకు వెలుతు తన కుమార్తె అలిజ(2)ను తీసుకెళ్లింది. చంద్రకాలనీ రీలింగ్ కేంద్రంలో వదలడంతో చిన్నారి నీళ్లు అనుకోని టార్పెంట్ ఆయిల్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. చిన్నారిని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది.