News September 11, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి: జగిత్యాల కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మల్లాపూర్ మండలం చిట్టాపూర్, ముత్యంపేట గ్రామాల్లో నిర్మిస్తోన్న ఇందిరమ్మ ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల్లో ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఆర్డీఓ శ్రీనివాస్, ఇంజినీరింగ్ పంచాయతీ అధికారి లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ప్రసాద్, తహశీల్దార్, ఎంపీడీవో తదితరులు ఉన్నారు.

Similar News

News April 14, 2026

అమీన్‌పూర్‌లో కూల్చివేతలు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

image

అమీన్‌పూర్ పరిధిలోని ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూల్చివేతలు చేయొద్దని ఆదేశించింది. నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం ఏంటని, హైడ్రా విధివిధానాలు ఏంటో చెప్పాలని పేర్కొంది. ఇక చెరువులు, పార్కులు, రోడ్లు ఆక్రమిస్తే కూల్చివేయచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

యంగ్ ఏజ్‌లో అతిగా డ్రింక్ చేస్తే..

image

స్ట్రెస్ నుంచి బయటపడ్డానికి మద్యం సేవించే యూత్‌కు మసాచుసెట్స్ వర్సిటీ రీసెర్చర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. యంగ్ ఏజ్‌లో ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే మధ్యవయసుకొచ్చే సరికి మెదడు పనితీరు మందగిస్తుందని తేల్చారు. తర్వాత మానేసినా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తిరిగిరాదన్నారు. ఇది భవిష్యత్తులో జ్ఞాపకశక్తి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. అప్పుడు కోలుకోవడానికి ప్రత్యేక చికిత్సలు అవసరమని తెలిపారు.