News April 15, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు కట్టుదిట్టమైన కార్యాచరణ: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికకు కట్టుదిట్టమైన కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 21 లోపు ఇందిరమ్మ కమిటీల నుంచి 25 శాతం బఫర్‌తో ప్రతి గ్రామానికి, వార్డుకు అలాట్ చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా వివరాలు తెలుసుకోవాలన్నారు.
Similar News
News January 9, 2026
ప్రకాశం: లోన్ తీసుకున్నారా.. అసలు కడితే చాలు.!

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు SC కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ కీలక సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలో కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందిన వారు కొవిడ్-19 కారణంగా గతంలో రుణాలు చెల్లించలేదన్నారు. అలాంటి వారికోసం ప్రస్తుతం వడ్డీ పూర్తి రద్దుతో నగదు చెల్లించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 30లోగా వడ్డీ లేకుండా చెల్లించి రుణాలను మాఫీ చేసుకోవచ్చన్నారు.
News January 9, 2026
IOCLలో 509 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News January 9, 2026
సంగారెడ్డి: ఉమ్మడి జిల్లాలో మహిళలదే పై చేయి

మున్సిపాలిటీ ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. దీని ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 19 మున్సిపాలిటీల్లో మొత్తం 5,43,103 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2,73,219 మంది కాగా, పురుష ఓటర్లు 2,69,432 మంది ఉన్నారు. ఎన్నికలు జరగనున్న అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు 3787 మంది ఎక్కువగా ఉన్నారు.


