News April 16, 2025
ఇందిరమ్మ గృహాలకు 300 మంది మార్కింగ్: VKB కలెక్టర్

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 300 మంది ఇంటి నిర్మాణానికి మార్కింగ్ చేశారని, 25 మంది బేస్మెంట్ పూర్తి చేశారని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారికి అమౌంట్ జమ చేయనున్నట్లు వెల్లడించారు.
Similar News
News April 16, 2025
HYD: మహిళా భద్రత కోసం T-SAFE యాప్

మహిళా భద్రత కోసం యువత టెక్నాలజీని వినియోగిస్తున్నారని మహిళా భద్రత విభాగం డీజీ షికా గోయల్ తెలిపారు. T-సేఫ్ ఆండ్రాయిడ్ యాప్‌ను ఇప్పటి వరకు 42,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనివల్ల 36,263 ట్రిప్పులు నమోదు కాగా, 30% పైగా మూడు కమిషనరేట్ల పరిదివే, 65,000కుపైగా ఏజెంట్ కాల్స్ అందినట్లు పేర్కొన్నారు. మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్నామని, T-SAFE యాప్ మీరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
News April 16, 2025
అమెరికాలో అనారోగ్యంతో మధిర వాసి మృతి

మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన వెలగపూడి రమేశ్ అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రమేశ్ అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని అమెరికా నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు రమేశ్ ఫ్రెండ్స్, తానా కమిటీ వారు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
News April 16, 2025
ALERT: లాసెట్ దరఖాస్తు గడువు పెంపు

TG: LLB, LLM కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. దరఖాస్తు చేసుకునేందుకు నిన్నటితో గడువు ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ నెలాఖరు వరకూ పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చని వివరించారు. ఇప్పటి వరకు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు.