News November 15, 2024
ఇంద్రవెల్లి: ఎక్సైజ్ కానిస్టేబుల్.. జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపిక

ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంటకి చెందిన శ్యామ్ రావ్, రేఖ బస్సి దంపతుల కుమార్తె ప్రీతి గ్రూప్ -4 ఫలితాల్లో కొలువు సాధించింది. ఇదివరకే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో జాయిన్ అయింది. గ్రూప్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో సెలవు పెట్టి ఉద్యోగానికి సన్నద్ధమైంది. ఎట్టకేలకు గ్రూప్ -4 రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికైంది. దింతో బంధుమిత్రులు అభినందించారు.
Similar News
News September 18, 2025
పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

ప్రభుత్వ పాటశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో మండలాల వారిగా, పాఠశాల సముదాయాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా ఆగస్టు నెల సగటు విద్యార్థుల హాజరు నివేదికలు, టాప్ 5 పాఠశాలలు, అట్టడుగు 5 పాఠశాలలు, పాఠశాల కాంప్లెక్స్ వారీగా సమస్యలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు.
News September 18, 2025
ADB: క్రైస్తవ సంఘాలతో ఛైర్మన్ సమావేశం

రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ ఆదిలాబాద్‌లో బుధవారం పర్యటించారు. కలెక్టర్ రాజర్షిషాతో కలిసి క్రైస్తవ సంఘాలు, పాస్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్రైస్తవ శ్మశానవాటికకు భూమి, బీసీ-సీ కుల ధ్రువీకరణ పత్రం, క్రైస్తవ కమ్యూనిటీ హాల్ వంటి వారి సమస్యలను ఆయనకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చారు.
News September 18, 2025
ఆరోగ్యమే మహాభాగ్యం: ఆదిలాబాద్ ఎంపీ

ఆదిలాబాద్‌లో నిర్వహించిన స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరంలో ఎంపీ గోడం నగేశ్ పాల్గొన్నారు. బుధవారం హమాలీవాడ అర్బన్ హెల్త్ సెంటర్లో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాతో కలిసి పేదలకు పథకం ద్వారా అందించే ఫుడ్ కిట్స్‌ను ఎంపీ పంపిణీ చేశారు. శిక్షణ కలెక్టర్ సలోని, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.