News March 19, 2024
ఇంద్రవెల్లి: గొంతు తడవాలంటే 2KM వెళ్లాల్సిందే..!
ఇంద్రవెల్లి మండలం సాలెగూడ గ్రామస్థులకు తాగు నీరు లేక అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో గిరిజనులు గ్రామంలో ప్రతీ ఇంటి ముందు డ్రమ్ములతో కూడిన ఎడ్లబండ్లే దర్శనమిస్తున్నాయి. నీళ్లు కావాలంటే బండి కట్టాల్సిందేనని.. రోజూ సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పంట చేల వద్దకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం పనులు సైతం వదులుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
Similar News
News December 28, 2024
ఆసిఫాబాద్: ఏడాదిలో 1207 కేసులు నమోదు
ఆసిఫాబాద్ జిల్లాలో గత సంవత్సరం కంటే హత్య కేసులు 45.45%, రోడ్డు ప్రమాదాలు 1.6% తగ్గాయని జిల్లా SP శ్రీనివాసరావు తెలిపారు. SPవార్షిక నివేదికను విడుదల చేసి మాట్లాడారు. 2024లో జిల్లాలో 12 హత్య కేసులు, 82ఆస్తి సంబంధిత నేరాలు, 3నేర పూరిత నరహత్యలు, 04దొమ్మి కేసులు,18 కిడ్నాప్‌లు, 24 రేప్‌లు, 34 SC,STనేరాలు, 27పోక్సో,39 గంజాయి కేసులు, 188మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు నమోదయాయన్నారు.
News December 28, 2024
ఆదిలాబాద్: ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు
ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు స్పెషల్ అడ్మిషన్ల గడువు పొడిగించినట్లు ఆదిలాబాద్ డీఈఓ ప్రణీత పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 24తో గడువు ముగియగా ఈనెల 30 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. కావున విద్యార్థులు www.Telanganaopenschool.orgలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. SHARE IT
News December 28, 2024
మంచిర్యాల: ఆన్లైన్ గేమ్‌లో మోసపోయిన ప్రభుత్వ ఉద్యోగి
ఆన్లైన్ గేమ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగిని మోసగించిన కేసులో సాంకేతిక పరిజ్ఞానంతో మంచిర్యాల బస్టాండ్‌లో నిందితుడిని పట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ PS SHO, DSP వెంకటరమణ తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ.1,36,96,290మోసపోయానని తమకు ఫిర్యాదు చేశాడన్నారు. దర్యాప్తు చేయగా నిందితుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ మహమ్మద్ అబ్దుల్ నయీం అని తెలిసి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.