News January 2, 2025
ఇంద్రవెల్లి: జనవరి 28 నుంచి నాగోబా జాతర
ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో నిర్వహించే నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న నాగోబా జాతరపై గురువారం కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా దర్బార్ హాల్లో జిల్లా అధికారులు, దేవాదాయ, దేవాలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జాతరకు లక్షలాది మంది ఆదివాసీలు, గిరిజనులు వస్తారని, అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News January 5, 2025
ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. శనివారం ఉష్ణోగ్రతలు అతి అల్పానికి చేరుకున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా సిర్పూర్(U) 6.1, ఆదిలాబాద్ జిల్లాలో అర్లి(T) 6.2, నిర్మల్ జిల్లాలో కుబీర్ 8.8, మంచిర్యాల జిల్లాలో జైపూర్ 10.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లా వాసులు తగు జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.
News January 4, 2025
కడెం: రేపు సాగు నీటిని విడుదల చేయనున్న ఎమ్మెల్యే
ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్మాట్, కడెం ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలోని రైతుల పొలాలకు ఎమ్మెల్యే బొజ్జు సాగునీటిని విడుదల చేయనున్నారని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. రబీ సీజన్‌కు సంబంధించి ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఉన్న రైతుల పొలాల్లో వేసే పంటల కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఆదివారం ఉదయం 10 గంటలకు సాగునీటిని విడుదల చేయనున్నారని వారు వెల్లడించారు. విషయాన్ని రైతులు, అందరూ గమనించాలని వారు సూచించారు.
News January 4, 2025
భీంపూర్: 3 ఆవులను చంపిన పెద్దపులి
పెద్దపులి దాడిలో 3 ఆవులు మృతి చెందిన ఘటన భీంపూర్‌లో చోటుచేసుకుంది. మండలంలోని పిప్పల్ కోటి గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లో శుక్రవారం మేతకు వెళ్లిన 3 ఆవులపై పులి దాడి చేసి చంపేయగా మరో 3 తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో రైతులు పంట చేలకు వెళ్లాలంటే జంకుతున్నారు.