News January 4, 2026
ఇంద్రవెల్లి: పాముకాటుతో బాలుడి మృతి

ఇంద్రవెల్లి మండలం సకారాం తాండకు చెందిన దయారాం భాగ్యశ్రీ దంపతులకు కుమారుడు విశ్వనాథ్ (4) పాము కాటుతో మృతి చెందాడు. శుక్రవారం పిల్లలతో కలిసి రేగి పండ్లు చెట్టు వద్దకు వెళ్లి పండ్లు తింటున్న సమయంలో పాము కాటేసింది. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News February 17, 2026
పాకిస్థాన్ సూపర్-8కు వెళ్లాలంటే?

T20WC-2026: సూపర్-8 చేరేందుకు పాకిస్థాన్ రేపు కీలక మ్యాచ్ ఆడనుంది. నమీబియాపై గెలిస్తే 6 పాయింట్లతో నేరుగా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ వర్షంతో రద్దయినా 5 పాయింట్లతో వెళ్తుంది. నమీబియాతో ఓడిపోతే మాత్రం పాకిస్థాన్ ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు USA సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఇక USAతో (+0.788)పోలిస్తే పాకిస్థాన్ (-0.403) నెట్ రన్‌రేట్ తక్కువగా ఉంది.
News February 17, 2026
ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: ప్రకాశం కలెక్టర్

ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. మంగళవారం ప్రకాశం భవనం నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, సచివాలయాల సేవలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పారిశుద్ధ్యం, స్వామిత్వ సర్వేపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. APMAY 2.0 పథకంతో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.
News February 17, 2026
పిఠాపురంలో ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల విచారణ

పిఠాపురం పట్టణంలోని రెండు వర్గాలకు చెందిన యువకుల మధ్య తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటనలో ఐతే నగర్‌కు చెందిన మంగం నాగసురేశ్, సీకోటి ఆకాశ్‌తో పాటు, జీవన్ నగర్‌కు చెందిన ఏడిద వెంకటరమణ, కోడి సుబ్రహ్మణ్యం, రాజేష్‌లు గాయపడ్డారు. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలా లేక తక్షణ కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.


