News April 10, 2025
ఇంద్రవెల్లి: భర్తపై ప్రియుడితో కలిసి గొడ్డలితో దాడి

భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసిన ఘటన ఇంద్రవెల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గోపాల్‌పూర్ వాసులు సాహెబ్ రావ్, ఎల్లవ్వ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. 4నెలల క్రితం సాహెబ్ రావ్ చిన్నమ్మ కోడుకు దశరథ్ వారి ఇంటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. సాహెబ్ పనినిమిత్తం వేరే ఊరికి వెళ్లడంతో ఎల్లవ్వ, దశరథ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి భర్త మందలించడంతో అతడిని చంపేందుకు యత్నించారు.
Similar News
News February 16, 2026
మహాశివరాత్రి జాతరను ప్రశాంతంగా నిర్వహించాం: ఎస్పీ

వేములవాడ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించామని ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారని సిబ్బందిని అభినందించారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో నిఘా పటిష్ఠం చేశామని, భక్తులకు అవసరమైన చోట సహాయం అందించామని వెల్లడించారు.
News February 16, 2026
APPLY NOW: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News February 16, 2026
జగిత్యాల జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

జిల్లాలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక ప్రక్రియ దృష్ట్యా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపల్ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.


