News September 10, 2025

ఇంద్రవెళ్లి : రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

image

ఇంద్రవెళ్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని ధన్నుర బి వద్ద ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఒక బైక్‌పై గుడిహత్నూర్ మండలానికి చెందిన ఇద్దరు యువకులు, మరో బైక్‌పై ఉట్నూర్ మండలం ఉమ్రి తాండ్రకు చెందిన ఒక కుటుంబం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 10, 2025

గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

ADB జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారి చేసింది. ఎన్నికల అధికారిగా జిల్లా సహకార అధికారి, జాయింట్ రిజిస్టర్ మోహన్‌ను నియమించారు. మొత్తం 12 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగనుండగా… ఈనెల 12న నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ జరగనుంది. 17న పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

News September 10, 2025

నార్నూర్ కేజీబీవీని సందర్శించిన సబ్ కలెక్టర్

image

నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ బుధవారం సందర్శించారు. ఈ పాఠశాలలో ఉదయం విద్యార్థినుల భోజనంలో పురుగులు ఉన్నాయని ఆరోపణలు రాగా ఆయన ఈ ఘటనపై ఆరా తీశారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆయనతో పాటు విద్యాధికారి పవార్ అనిత, తహశీల్దార్ రాజలింగం తదితరులు ఉన్నారు.

News September 10, 2025

ఆదిలాబాద్: అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ఎండోన్‌మెంట్ భూములు, భూ భారతిలో నమోదైన సాదాబైనామాలు, అసైన్డ్ ల్యాండ్ దరఖాస్తులపై గూగుల్ మీట్ ద్వారా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ మండలాల్లో పెండింగ్‌‌లో ఉన్న దరఖాస్తులు, భూపరమైన వివాదాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. భూ భారతి అప్లికేషన్‌లో నమోదవుతున్న సాదా బైనామాలు, వాటి పరిశీలన, ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.