News October 11, 2025

ఇకనైనా మారుతారా? జైలు శిక్షలు తప్పవన్న SP

image

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని జిల్లా SP రాజేష్ చంద్ర హెచ్చరించారు. శుక్రవారం 42 మందికి జైలు శిక్ష, జరిమానాలు విధిస్తూ న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారన్నారు. దేవునిపల్లి, కామారెడ్డి, సదాశివనగర్, మాచారెడ్డి పరిధిలోని 8 మందికి ఒక్కొక్కరికీ 1 రోజు జైలు శిక్ష, వెయ్యి చొప్పున ఫైన్ విధించారు. మిగిలిన 34 మందికి కలిపి రూ.34 వేల జరిమానా విధించారని SP వెల్లడించారు.

Similar News

News October 11, 2025

ములుగు వైపు అందరి చూపు..!

image

కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు ములుగులో హీటెక్కిస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పీఠం కోసం మంత్రి సీతక్కకు చెమటలు పట్టేలా చేస్తున్నాయి.డీసీసీ కోసం కుమారుడు కుంజ సూర్య ఆశిస్తుండగా, మరోపక్క తన అనుచరుడిగా ఉన్న పైడాకుల అశోక్ సైతం మరోమారు పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ZPTC స్థానం రిజర్వు విషయంలో నొచ్చుకున్న అనుచరుడు, డీసీసీ విషయంలో మంత్రి కుమారుడు పోటీ పడుతుండడంతో ఏం జరగనుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News October 11, 2025

ఖమ్మం: తీవ్ర విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

image

ముదిగొండ మండలం పెద్ద మండవ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. బైక్‌ను ఇసుక ట్రాక్టర్‌ బలంగా ఢీకొనడంతో.. పెద్దమండవకు చెందిన పేరం ప్రవీణ్(14), గొర్రె మచ్చు సనా(9) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి గొర్రెముచ్చు సాయికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 11, 2025

HYD: GOVT ఆస్పత్రులకు వచ్చిన సహాయకులకు తప్పని కష్టాలు..!

image

ఉస్మానియా, గాంధీ సహా HYD సిటీలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులతో వచ్చిన అటెండర్లు ఉండడం కోసం సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు సహాయకులు వాపోయారు. అసలు సహాయకులను ఒక్కోసారి ఆసుపత్రి పక్కన సైతం పడుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.