News October 9, 2025

ఇకనైనా ANU ప్రతిష్ట మెరుగుపడుతుందా?

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక పరిపాలనకు తెరపడింది. గతంలో కంటే యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్ 24 స్థానాలు తగ్గడంతోపాటు, విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై Way2Newsలో పలు కథనాలు ప్రరిచురించబడ్డాయ. ఈ పరిస్థితుల్లో నూతన వీసీ అకాడెమిక్ నాణ్యత, పేపర్ వాల్యుయేషన్, ఫలితాలలో పారదర్శకత, విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తే విశ్వవిద్యాలయ ప్రతిష్టను పునరుద్ధరించేందుకు అవకాశముంది.

Similar News

News October 9, 2025

సిద్దిపేట: కొండెక్కిన కొబ్బరికాయ ధర!

image

కొబ్బరికాయల ధర కొండెక్కి కూర్చొంది. చిన్న కాయ అయినప్పటికీ ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతోంది. దీంతో కొబ్బరి కాయలను కొనాలంటేనే వినియోగదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేట మార్కెట్లో చిన్న సైజ్‌ కొబ్బరికాయ ధర రూ.35 కాగా.. ఒక మోస్తరు సైజ్‌ కొబ్బరి ధర రూ.45 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. ధర మునుపెన్నడు లేని విధంగా అమాంతంగా పెరగడంతో వినియోగదారులు అవసరమైతే తప్ప కొనడం లేదు.

News October 9, 2025

యాదాద్రి: కోతులను మాస్కులతో తరిమేస్తున్నారు.!

image

అడ్డగూడూరు మండలం కోటమర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నిత్యం కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ విద్యార్థులు భోజనం చేసే సమయంలో కోతులు విరుచుకుపడుతూ, దాడులు చేస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి విద్యార్థులు గురువారం చింపాంజీ, సింహం ఆకారంలో ఉన్న మాస్కులు ధరించి, కోతులను తరిమికొట్టేందుకు వినూత్నంగా యత్నించారు. నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.

News October 9, 2025

వైసీపీ నాయకులు చేసిన తప్పే టీడీపీ నేతలు చేస్తున్నారా?

image

YCP గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందడంలో కొందరు నాయకుల అసభ్యకర వ్యాఖ్యలే కారణమనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అదే విధానాన్ని <<17940542>>TDPలో కొందరు ఎమ్మెల్యేలు<<>> అవలంభిస్తున్నారనే చర్చ మొదలైంది. కొడాలి, అంబటి, రోజా, వంశీ వంటి నాయకులు గతంలో అసభ్య పదజాలంతో మాట్లాడేవారు. జీడీ నెల్లూరు <<17949084>>ఎమ్మెల్యే థామస్<<>> చేసిన వ్యాఖ్యలు ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇలాంటి బూతు రాజకీయాలు మానుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.