News October 14, 2025
ఇకపై అన్ని ఫ్యాక్టరీలలో మాక్ డ్రిల్: కలెక్టర్

జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలలో మాక్ డ్రిల్ నిర్వహించాలని కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలలో ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికులు వాటి నుంచి బయటపడేలా, అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. భద్రతా చర్యలపై ప్రతి ఫ్యాక్టరీ నుంచి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. A కేటగిరిలో 4, B1లో 26, B2లో 6 మొత్తం 36 పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై సమీక్షించారు.
Similar News
News October 15, 2025
ఈ నెల 16న నిర్మల్‌లో జాబ్ మేళా

ఈ నెల 16న నిర్మల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి గోవింద్ తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలలో ఖాళీలు ఉన్నాయన్నారు. దాదాపు 68 ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 15, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.17 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.54 గంటలకు
✒ ఇష: రాత్రి 7.07 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 15, 2025
బాలికల సంక్షేమమే లక్ష్యం: DMHO

అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా విజయనగరం కేజీబీవీలో బాలికల ప్రాముఖ్యతపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. DMHO జీవన రాణి మాట్లాడుతూ.. బాలికల సంక్షేమానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బాలికల కోసం ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయని వారి హక్కులకు భంగం కలిగితే చర్యలు తప్పవన్నారు. అనంతరం ర్యాలీ చేపట్టి లింగ వివక్షత ఉండరాదని నినాదాలు చేశారు.