News August 24, 2025
ఇకపై ప్రతి నెలా 4వ శనివారం బ్యాగ్‌లెస్ డే: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో శనివారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాగ్‌లెస్ డే అమలు జరిగిందని ఇకపై ప్రతి నెలా 4వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. విద్యార్థులు పుస్తకాలు, బ్యాగులు లేకుండా పాఠశాలకు హాజరై వివిధ సృజనాత్మక, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని, పిల్లలలో సామాజిక అవగాహన పెంపొందించడమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News November 6, 2025
వెట్‌ల్యాండ్‌లలో నిర్మాణాలు నిషేధం: అదనపు కలెక్టర్

వెట్‌ల్యాండ్‌ల సంరక్షణ ద్వారానే పర్యావరణానికి మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో వెట్‌ల్యాండ్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 467 వెట్ ల్యాండ్‌లు 8,911 హెక్టార్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిల్లో నిర్మాణాలు చేపట్టడం, వ్యర్థాలు వేయడం నిషేధమని ఆయన తెలిపారు. భూ యాజమాన్యం మారదనే విషయాన్ని రైతులు గమనించాలని, ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
News November 6, 2025
టేకులపల్లి ఐటీఐలో నవంబర్ 7న జాబ్ మేళా

భారత్ హ్యుండాయ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 24 ఉద్యోగాల భర్తీకి నవంబర్ 7న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. డిగ్రీ అర్హతతో సేల్స్ కన్సల్టెంట్స్ (రూ.18,000), డీజిల్ మెకానిక్ లేదా బిటెక్ అర్హతతో సర్వీస్ అడ్వయిజరీ (రూ.12,000) పోస్టులు ఉన్నాయని చెప్పారు.
News November 5, 2025
చేప పిల్లల పంపిణీ పక్కాగా జరగాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శ్రీజ

ఖమ్మం జిల్లాలో చేప పిల్లల పంపిణీ, విడుదల పక్కాగా జరగాలని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ డా. పి. శ్రీజ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 882 చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందన్నారు. నవంబర్ 6 నాటికి మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. కాలుష్యం ఉన్న చెరువుల్లో చేప పిల్లలు వేయవద్దని, వివరాలను టీ-మత్స్య యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.


