News January 27, 2026

ఇకపై 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: TGPSC

image

TG: ఈ ఏడాది నుంచి ఉద్యోగ నియామకాల్లో ఫలితాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండబోదని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చాక సింగిల్ స్టేజ్ పరీక్షలు 3 నెలల్లో, మల్టీ స్టేజ్ పరీక్షలను 6 నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఉద్యోగ నియామకాల్లో టైం లైన్స్ పాటిస్తామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న రిక్రూట్‌మెంట్లను పూర్తి చేశామని చెప్పారు.

Similar News

News February 18, 2026

సర్వంAI.. ఈసారి జెమినీ ఫ్లాష్, డీప్‌సీక్‌కు పోటీగా

image

ఇటీవల <<19088829>>అక్యూరసీలో<<>> చాట్‌జీపీటీ, జెమినీని బీట్ చేసిన సర్వంAI తాజాగా రెండు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM) రిలీజ్ చేసింది. 30B, 105B అనే మోడల్స్ బడా ఏఐ మోడల్స్‌కు దీటుగా పనిచేస్తాయని సంస్థ తెలిపింది. ముఖ్యంగా 105B LLM జెమినీ 2.5 ఫ్లాష్, చైనాకు చెందిన డీప్‌సీక్ R1 మోడల్స్ కంటే సమర్థంగా పనిచేస్తుందని పేర్కొంది. నిర్వహణ ఖర్చు కూడా వాటితో పోలిస్తే తక్కువేనని తెలిపింది.

News February 18, 2026

మరోసారి భారత్ vs పాక్?

image

పాకిస్థాన్ సూపర్-8కు క్వాలిఫై కావడంతో T20WCలో మరోసారి భారత్‌తో తలపడే అవకాశం ఉంది. భారత్ గ్రూప్-1, పాక్ గ్రూప్-2లో ఉండటం వల్ల సూపర్-8లో అది సాధ్యం కాదు. కానీ సూపర్-8లో గ్రూప్-1లో భారత్ ఫస్ట్, గ్రూప్-2లో పాక్ సెకండ్ వస్తే సెమీస్‌లో తలపడొచ్చు. భారత్ సెకండ్, పాక్ ఫస్ట్ వచ్చినా సాధ్యమే. ఒకవేళ రెండు జట్లు వేర్వేరు సెమీస్‌లో నెగ్గితే కొలంబో వేదికగా IND vs PAK ఫైనల్ చూసే ఛాన్స్ ఉంటుంది.

News February 18, 2026

పిల్లలు వద్దు బొమ్మలే ముద్దు అంటున్న చైనా జెన్‌జీ

image

జననాల రేటు తగ్గిపోతున్న చైనాలో జెన్‌జీ మహిళలు పిల్లల కంటే బొమ్మలే మేలంటున్నారు. తమకు నచ్చిన బొమ్మను డిజైన్ చేయించుకుని దానినే తమ బిడ్డగా లాలించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని భావిస్తున్నారు. పిల్లలను 18ఏళ్ల వరకు పెంచేందుకు దాదాపు రెండున్నర లక్షల డాలర్లపైనే అవుతుందని.. అదే బొమ్మ అయితే 200-800 డాలర్లలో దొరికేస్తుందని అంటున్నారు. దీని వల్ల తమ కెరీర్‌కు కూడా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.