News September 23, 2025

ఇక ఆ 29 సారా రహిత గ్రామాలు: కలెక్టర్

image

‘నవోదయం’ కార్యక్రమం ద్వారా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 8 మండలాల్లోని 29 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా ప్రకటించినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సారా రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని మహేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనా, డీఆర్ఓ మాధవి పాల్గొన్నారు.

Similar News

News September 23, 2025

వన్డేల్లో కోహ్లీ ఆడతారా? ఆడరా?

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. వచ్చే నెలలో AUSతో వన్డే సిరీస్‌కు ముందు AUS-Aతో ODI సిరీస్‌లో ఆడాలని రోహిత్, కోహ్లీకి BCCI సూచించినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రోహిత్ ప్రాక్టీస్ మొదలెట్టగా, BCCIకి కోహ్లీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని సమాచారం. దీంతో ఆయన ఆడటంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ తన ఫ్యామిలీతో లండన్‌లో ఉంటున్నారు.

News September 23, 2025

పాడేరు: మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలి

image

మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సంతృప్తికరమైన సేవలు అందించి, పీజీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంగళవారం పాడేరు కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. మ్యూటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మ్యూటేషన్లకు సంబంధించి ప్రణాళికలు రూపొందించి, త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

News September 23, 2025

అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు: డీటీఓ

image

దసరా పండుగను ఆసరాగా తీసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం అమలాపురంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో 388 ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి, రూ.33 లక్షల జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి వారం తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.