News December 31, 2025
ఇక ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లపై రాయితీలు ఉండవ్!

కేంద్రం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల సబ్సిడీని నిలిపివేసేందుకు సిద్ధమైంది. ఈ విభాగంలో 32% వాహనాలు బ్యాటరీతోనే నడవాలని నిర్దేశించుకున్న PM E-Drive పథకం లక్ష్యం నెరవేరింది. ఇకపై ప్రోత్సాహకాలు అందించే బాధ్యతను రాష్ట్రాలకే వదిలేయాలని యోచిస్తోంది. అయితే టూ-వీలర్ల విషయంలో మాత్రం ఇంకా లక్ష్యం పూర్తి కాలేదు. వాటికి వచ్చే ఏడాది కూడా రాయితీలు కొనసాగే అవకాశం ఉంది. కార్లు, బస్సులకూ ఆదరణ పెరగాల్సి ఉంది.
Similar News
News January 1, 2026
OP సిందూర్‌కు రాముడే ఆదర్శం: రాజ్‌నాథ్

ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ‘రాముడి లక్ష్యం కేవలం రావణుడిని చంపడమే కాదు.. అధర్మాన్ని అంతం చేయడం. మేం కూడా ఉగ్రవాదులకు, వాళ్లను పెంచి పోషిస్తున్న వారికి గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా OP సిందూర్ చేపట్టాం’ అని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాల్లో రామ జన్మభూమి ఉద్యమం ఒకటని, 5 దశాబ్దాలకు పైగా కొనసాగిందని పేర్కొన్నారు.
News January 1, 2026
మామిడి తోటల్లో పూత రాలేదా? ఏం చేయాలి?

ప్రస్తుతం మామిడి చెట్లలో కొన్నింటికి పూత మొగ్గలు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం ఎలాంటి పూత కనిపించడం లేదు. దీని వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. చలి తీవ్రత, పొగ మంచు, ఇతర అంశాలు ఈ పరిస్థితికి కారణం అంటున్నారు నిపుణులు. మామిడిలో మంచి పూత రావాలంటే ఏం చేయాలి? నీరు అందించడంలో జాగ్రత్తలు, తేనె మంచు, బూడిద తెగులు కనిపిస్తుంటే ఎలాంటి మందులు పిచికారీ చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 1, 2026
AQI: దేశంలో హైదరాబాద్ బెస్ట్

దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వాయు కాలుష్యం తక్కువగా ఉంది. మెట్రోపాలిటన్ నగరాల్లో మంగళవారం AQI 150కి పైగానే ఉండగా హైదరాబాద్‌లో 99గా నమోదైంది. ఢిల్లీలో 388, ముంబై 136, కోల్‌కతా 170, చెన్నై 186, బెంగళూరు 115, అహ్మదాబాద్ 164, పుణేలో 247గా ఉంది. కాలుష్యం తక్కువగా ఉండటంతో చాలా మంది హైదరాబాద్‌వైపు చూస్తున్నారు. దేశానికి రెండో రాజధాని చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది.


