News August 23, 2025

ఇక నుంచి ఎవ్వరికి పెరోల్ లేఖ ఇవ్వను: కోటంరెడ్డి

image

ఇక నుంచి తాను ఎవరికీ పెరోల్ కోసం లేఖలు ఇవ్వనని MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. తాను, గూడూరు MLA సునీల్ ఇచ్చిన లేఖలను హోమ్ శాఖ తిరస్కరించిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య సైతం లేఖలు ఇచ్చారని వాటితోనే శ్రీకాంత్‌కు పెరోల్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News August 23, 2025

గణేశ చతుర్థి ఉత్సవాలకు పోలీసుల కీలక సూచనలు

image

గణేష్ చతుర్థి ఉత్సవాలకు జిల్లా పోలీసు శాఖ కీలక సూచనలు చేశారు. విగ్రహాలను రహదారులకు దూరంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని, తాత్కాలిక సీసీ కెమెరాలు పెట్టాలని, రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. మండపాల వద్ద ఇసుక బస్తాలు, డ్రమ్ముల్లో నీరు, అగ్ని ప్రమాద నిరోధిక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే 112కు సమాచారం ఇవ్వాలన్నారు.

News August 23, 2025

విశాఖ సెంట్రల్ జైలుకు శ్రీకాంత్ తరలింపు

image

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీ షీటర్ శ్రీకాంత్‌ను అధికారులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. భద్రతా కారణాలు దృష్ట్యా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఉదయం 6:30 సమయంలో విశాఖ జైలుకు అతను చేరుకున్నాడు. పెరోల్ రద్దు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అతన్ని వేరే జైలుకు తరలిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అతన్ని విశాఖ తరలించారు.

News August 23, 2025

నెల్లూరు: ఆథరైజ్డ్ బార్లకు నో రెస్పాన్స్

image

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బార్ల పాలసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో ఆథరైజ్డ్ బార్ల దరఖాస్తులకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఈనెల 18న జిల్లాలో బార్ల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలై ఇప్పటి వరకు ఐదు రోజులు కావస్తున్నా దరఖాస్తులు దాఖలు కాలేదు. నూతన బార్ల విధానం నిర్వహకులకు భారంగా మారుతుందని పలువురు వాపోయారు.