News March 10, 2025

ఇక నుంచి ‘కొమురవెళ్లి పుణ్యక్షేత్రం’ రైల్వే స్టేషన్

image

మనోహరాబాద్- కొత్తపల్లి నుంచి హైదరాబాద్ వరకు వేస్తున్న కొత్త రైల్వే పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయ రైల్వే జంక్షన్‌కు ‘కొమురవెల్లి పుణ్యక్షేత్రం’ అని నామకరణం చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో మరో మూడు స్టేషన్‌లు గుర్రాలగొంది, చిన్నలింగపూర్, సిరిసిల్ల పేర్లను లిస్టులో పెట్టారు.

Similar News

News February 28, 2026

జగిత్యాల: మహిళకు పూర్తి రక్షణ కల్పించాం: డీడబ్ల్యూఓ

image

జగిత్యాల సఖి వన్ స్టాప్ సెంటర్ లో చోటుచేసుకున్న ఘటనపై జిల్లా సంక్షేమ అధికారి (DWO) కె. రాజ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. సెంటర్‌లో ఆశ్రయం పొందుతున్న మహిళకు పూర్తి రక్షణ కల్పించామని తెలిపారు. కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడ్డాడని చెప్పారు. ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

News February 28, 2026

పాక్‌తో మేము చర్చలకు సిద్ధం: అఫ్గానిస్థాన్

image

పాక్‌తో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నట్లు అఫ్గానిస్థాన్ ప్రకటించింది. కాగా ఇప్పటికే ఈ ఉద్రిక్తతలపై వెనక్కి తగ్గాలని చైనా, బ్రిటన్ సహా పలు దేశాలు సూచించాయి. అఫ్గాన్‌తో పోరులో 274 మంది తాలిబన్లను అంతం చేశామని మరో 400 మంది గాయపడినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అంతకుముందు తమ దాడుల్లో 50 మంది పాకిస్థాన్ జవాన్లు చనిపోయినట్లు తాలిబన్ సర్కార్ చెప్పుకొచ్చింది.

News February 28, 2026

అన్నదాతకు రూ.25 వేల మద్దతు ధర వచ్చేనా.?

image

వరికి ఒక క్వింటా ₹2389 లెక్కన పుట్టి ధర ₹21330 వరకు A- గ్రేడ్ రకానికి ఇస్తుండగా సాధారణ రకానికి పుట్టి ధర ₹20,136 చొప్పున నిర్ణయించారు. అయితే కేంద్రాల్లో ధాన్యం విక్రాయించాలంటే తరుగులతో కొంత తీసేస్తుండగా గొనె సంచులు, రవాణా ఖర్చులు రైతులే భరించాల్సి ఉంది. దీంతో ఎకరాకు రూ.35-40 వేల వరకు ఖర్చు అవుతుండగా రైతుకు రూ.20 వేలు కూడా మిగలడం లేదు. ప్రభుత్వం పుట్టికి రూ.25 వేల మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరారు.