News March 10, 2025
ఇక నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం: VZM SP

విజయనగరం జిల్లాలో MLC ఎన్నికల కోడ్ ముగియడంతో ఇకపై యథావిధిగా ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహిస్తామని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు ఇవ్వవచ్చన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News November 8, 2025
మండలానికి 500 ఎకరాల్లో ఉద్యాన పంటలు: VZM కలెక్టర్

కూరగాయల పెంపకంపై దృష్టి పెట్టాలని, రైతులకు సుస్థిర లాభం వచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. ఉద్యాన, పశు సంవర్ధక, అటవీ, ఏపీఎంఐపీ శాఖలపై శుక్రవారం సమీక్ష జరిపారు. మండలానికి కనీసం 500 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలన్నారు. స్థానిక మార్కెట్ డిమాండ్ మేరకు కూరగాయలు, పూల తోటలు, అరటి, బొప్పాయి, పుట్టగొడుగు సాగు పెంచాలని సూచించారు.
News November 7, 2025
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

గరివిడి మండలం చిన ఐతంవలస వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో చీపురుపల్లి మండలం పెరుమాళికి చెందిన కొరగంజి శ్రీలత (48)మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త సంగం నాయుడుతో కలిసి స్కూటీపై చీపురుపల్లి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.ఈ దుర్ఘటనలో బస్సు ముందు చక్రం శ్రీలత తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా నాయుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు.
News November 7, 2025
VZM: కంచం చేత పట్టి లైన్‌లో నిల్చున్న కలెక్టర్

గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు బోధన చేయడమే కాకుండా వారితో పాటు కంచం పట్టుకుని లైన్లో నిల్చున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.


