News December 22, 2025
ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

MGNREGA స్థానంలో కేంద్రం కొత్తగా తెచ్చిన VB-G RAM G చట్టంతో రైతులకు ఊరట దక్కనుంది. ఈ చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో పీక్ అగ్రికల్చర్ సీజన్ (పంటలు వేసే, కోసే)లో 60 రోజుల పాటు ఉపాధి పనులు నిలిపివేసే వెసులుబాటు ఉంది. దీనివల్ల రైతులకు కూలీల కొరత నుంచి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు ఉపాధి హామీ పని దినాలు 100 నుంచి 125 రోజులకు పెరగడంతో కూలీల ఆదాయం 25% పెరగనుంది.
Similar News
News December 22, 2025
GOOGLE MAP సాయంతో లూటీ… చివరకు ఏం జరిగిందంటే?

టెక్నాలజీ వాడుక ఇప్పుడు ఇళ్లలో లూటీలకూ పాకింది. గూగుల్ MAP స్ట్రీట్ వ్యూ ఫీచర్ సాయంతో ధనవంతుల ఇళ్లున్న ప్రాంతాలు, వాటిలోకి ఎలా చొరబడవచ్చో గుర్తించి ఓ ముఠా జంషెడ్‌పూర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం చేసింది. అయితే పోలీసులు CCTV ఫుటేజీ, మొబైల్ ట్రాకింగ్‌ను కంబైనింగ్ చేసి పట్నాలో ఉన్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా పక్కరాష్ట్రాలకు పారిపోయేలా రూట్‌నూ ఎంచుకొని మరీ తమ నుంచి తప్పించుకొనేదని పోలీసులు తెలిపారు.
News December 22, 2025
అమీర్‌పేట్ గురించి ఈ విషయం మీకు తెలుసా?

HYD అమీర్‌పేట్ అంటే కోచింగ్ సెంటర్ల అడ్డా మాత్రమే కాదు.. లక్షలాది నిరుద్యోగుల ఆశల వారధి. 1900 కాలంలో ఆరో నిజాం తన జాగీర్దార్ అమీర్ అలీకి ఈ ప్రాంతాన్ని కానుకగా ఇచ్చారు. అప్పటి వేసవి రాజభవనమే నేటి నేచర్ క్యూర్ ఆసుపత్రి. రాజసం నిండిన ఈ గడ్డపై ఎందరో విద్యార్థులు నైపుణ్యం పెంచుకుని ప్రపంచస్థాయి కంపెనీలలో స్థిరపడ్డారు. ప్రతి విద్యార్థికి అమీర్‌పేట్ ఓ భావోద్వేగం. ఎంత ఎదిగినా ఈ చోటును ఎవరూ మర్చిపోలేరు.
News December 22, 2025
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీగా TIFFA సేవలు: మంత్రి సత్యకుమార్

APలోనే తొలిసారి 7 ప్రభుత్వ ఆస్పత్రుల్లో TIFFA స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి సత్యకుమార్ చెప్పారు. నర్సీపట్నం, తుని, నందిగామ ఏరియా ఆస్పత్రులు, ఒంగోలులోని MCH, పార్వతీపురం, తెనాలి, అనకాపల్లి జిల్లా ఆస్పత్రులకు అందించినట్లు చెప్పారు. ‘JAN 1 నుంచి ఉచిత సేవలు మొదలవుతాయి. ఈ స్కాన్‌తో 18-22 వారాల గర్భస్థ శిశువు లోపాలను కనుగొనవచ్చు. గర్భిణులకు ₹4K చొప్పున ఆదా అవుతుంది’ అని తెలిపారు.


