News October 28, 2025

ఇక ‘సింగూరు’ చిక్కులు లేకుండా ప్రభుత్వం చర్యలు

image

మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే సింగూరు రిజర్వాయరుకు మరమ్మతులు చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనికోసం సర్కారు రూ.16 కోట్లను విడుదల చేసింది. ఈ డిసెంబర్ నుంచి పనులు మొదలు కానున్నాయి. ఈలోపు రిజర్వాయర్‌లో ఉన్న నీటిని ఖాళీ చేయనున్నారు. దాదాపు రెండు ఏళ్ల పాటు సింగూరుకు పనులు జరగుతాయి. ప్రస్తుతం సింగూరు నుంచి సిటీకి 7 TMCల నీరు ఉపయోగిస్తున్నారు.

Similar News

News October 29, 2025

CM సాబ్‌తో ఆర్.నారాయణ మూర్తి మాట

image

యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సినీ కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డిని ఆర్.నారాయణ ఆలింగనం చేసుకున్నారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు, ఓ పాట పాడినట్లు ఆర్.నారాయణ మూర్తి తన శైలిలో CM రేవంత్‌‌తో ఏదో మాట్లాడారు.

News October 29, 2025

గంజాయి లేడి డాన్ అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురు

image

హైదరాబాద్ గంజాయి లేడీ డాన్‌గా పేరుగాంచిన అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురైంది. పీడీ యాక్ట్‌పై ఆమె వేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ధూల్‌పేట్‌ నుంచి గంజాయి వ్యాపారం నిర్వహిస్తూ అనేక కేసుల్లో నిందితురాలైన అంగూర్ భాయ్‌పై ప్రభుత్వం అమలు చేసిన పీడీ యాక్ట్‌ను సమర్థిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

News October 28, 2025

HYD: చీకటైనా పిల్లలు ఇంటికి రాలేదు.. పట్టించుకోరా?

image

యాచారం మం.లోని తాటిపర్తికి వెళ్లే బస్సు సకాలంలో రాకపోవడంతో బస్టాండ్‌లోనే విద్యార్థులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. నిత్యం ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతోన్నా పాలకులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థులు గమ్యస్థానాలకు చేరేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నేడు కొందరు లిఫ్ట్ అడిగి వెళ్లారు. మరికొందరు బస్టాండ్‌‌లో నిరీక్షించడం గమనార్హం. పాలకులకు పట్టవా? అన్న విమర్శలొస్తున్నాయి.