News October 28, 2025

ఇక ‘సింగూరు’ చిక్కులు లేకుండా ప్రభుత్వం చర్యలు

image

హానగరానికి తాగునీటిని సరఫరా చేసే సింగూరు రిజర్వాయరుకు మరమ్మతులు చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనికోసం సర్కారు రూ.16 కోట్లను విడుదల చేసింది. ఈ డిసెంబర్ నుంచి పనులు మొదలు కానున్నాయి. ఈలోపు రిజర్వాయర్‌లో ఉన్న నీటిని ఖాళీ చేయనున్నారు. దాదాపు రెండు ఏళ్ల పాటు సింగూరుకు పనులు జరగుతాయి. ప్రస్తుతం సింగూరు నుంచి సిటీకి 7 TMCల నీరు ఉపయోగిస్తున్నారు.

Similar News

News October 29, 2025

ఆదిలాబద్: ‘జనన బరువు ఆధారంగా శిశు మరణాల విశ్లేషణ చేయాలి’

image

ఆదిలాబాద్ జిల్లాలో నవజాత శిశు మరణాలను తగ్గించే దిశగా పటిష్ఠ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆరోగ్య శాఖ, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. బీబీనగర్ ఎయిమ్స్ ప్రొఫెసర్ త‌నిగై నాథన్ జిల్లాలో గత నెలలో నమోదైన శిశు మరణాల గణాంకాలు, జనన బరువు ప్రకారం విభజన, సంబంధిత గ్రామాలు, తల్లుల ఆరోగ్య వివరాలు, తీసుకున్న చర్యలు తదితర అంశాలను వివరించారు.

News October 29, 2025

మంచిర్యాల: నవంబర్ 3 నుంచి పత్తి కొనుగోళ్లు

image

మంచిర్యాల జిల్లాలోని 2 జిన్నింగ్ మిల్లుల్లో నవంబర్ 3వ తేదీ నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి షహాబుద్ధిన్ తెలిపారు. జిల్లాలోని తాండూరు మండలం మహేశ్వరి కాట్స్, దండేపల్లి మండలం వెంకటేశ్వర చిన్ని మిల్లులలో కొనుగోళ్లు ప్రారంభిస్తున్నామన్నారు. పత్తి రైతులు తప్పనిసరిగా కాపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని మాత్రమే పత్తిని విక్రయించాలన్నారు.

News October 29, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.