News June 11, 2024

ఇగ్లండ్‌లో పల్నాడు జిల్లా యువకుడి మృతి

image

ఉన్నత చదువుల కోసం ఇగ్లండ్‌ వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరుకు చెందిన సాయిరాం (24) ఉన్నత చదువుల కోసం ఇగ్లండ్‌ వెళ్లాడు. అయితే ఈ నెల 2న మాంచెస్టర్ బీచ్ వద్ద సాయిరాం మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. అనంతరం మాంచెస్టర్ నుంచి పల్నాడు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 29, 2025

తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. సంబంధిత అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుధ్య లోపం లేకుండా చూడాలన్నారు. పునరావాస కేంద్రాలలో కూడా పారిశుధ్య పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. ఎక్కడా నీరు నిలువ ఉండరాదని అన్నారు. కాలువల్లో పూడిక తీసి డ్రైన్ లను క్లియర్ చేయాలని చెప్పారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు.

News October 29, 2025

గుంటూరు జిల్లాలో పలు బస్సు సర్వీసులు రద్దు

image

మొంథా తుఫాన్‌ నేపథ్యంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆర్టీసీ పలు సర్వీసులను రద్దు చేసినట్లు డీపీటీఓ సామ్రాజ్యం తెలిపారు. గుంటూరు-1, 2, మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోల్లో కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారని, తద్వారా రద్దీ తగ్గడంతో సర్వీసులు తగ్గిస్తున్నట్లు తెలిపారు. కొన్నిచోట్ల వాగులు పొంగటం, చెట్లు పడటంతో రద్దు చేశామన్నారు.

News October 29, 2025

GNT: ఒక్క రాత్రిలో 1355.9 మి.మి వర్షపాతం

image

29 రాత్రి 12 గంటల నుంచి ఇప్పటివరకు నమోదైన వర్షపాతం వివరాలు. కాకుమాను116, పెదనందిపాడు 114.6, ప్రత్తిపాడు 109.4, చేబ్రోలు 91.4, కొల్లిపర 78.2, వట్టిచేరుకూరు 76.2, దుగ్గిరాల 74.6, తాడేపల్లి 74.2, GNT వెస్ట్‌ 68.8, పెదకాకాని 66.2, తాడికొండ 64.6, ఫిరంగిపురం 63.8, తుల్లూరు 62.8, తెనాలి 60.9, మేడికొండూరు 60.2, మంగళగిరి60, పొన్నూరు58, GNT ఈస్ట్‌ 58 మి.మిగా నమోదయింది.