News April 17, 2024
ఇచ్చోడలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి.. వివరాలు ఇవే..!

ట్రాక్టర్ అదుపుతప్పి <<13067453>>వ్యక్తి మృతి<<>> చెందిన ఘటన ఇచ్చోడ మండలం చించోలి క్రాస్ రోడ్ వద్ద జరిగిన విషయం తెలిసిందే. SI నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వడ్డర్ గూడకు చెందిన రాజేందర్ (33) ఇచ్చోడలో ట్రాక్టర్‌తో ఇటుక లోడు ఖాళీ చేసి వస్తుండగా ట్రాక్టర్ అతివేగంగా నడుపుతుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News April 23, 2025
ADB: ఈనెల 28 నుంచి కేయూ సెమిస్టర్ పరీక్షలు

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్, డిగ్రీ(బ్యాక్ లాగ్) మొదటి, మూడో, ఐదవ సెమిస్టర్ పరీక్షలను ఈనెల 28 నుంచి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా కొన్ని కళాశాలలు పరీక్షా ఫీజులు, నామినల్ రోల్స్ అందించని కారణాలతో వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తెలిపారు. సవరించిన పరీక్షా టైం టేబుల్, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్లో చూడవచ్చన్నారు.
News April 23, 2025
భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజు

భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆదిలాబాద్‌కు చెందిన గాజంగుల రాజు 3వ సారి ఎన్నికయ్యారు. HYDలో మంగళవారం జరిగిన సంఘం మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గాజంగుల రాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కీర్తి రమణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. దీంతో సంఘం నాయకులు వారి అభినందించారు.
News April 23, 2025
ADB: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రణయ్

ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సదాలి ప్రణయ్ సత్తా చాటాడు. ద్వితీయ సంవత్సరం MPC విభాగంలో 1000కి 991 మార్కులు సాధించి ఔరా అనిపించాడు. భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి సదాలి బాపన్న-గంగమ్మ దంపతుల కుమారుడు ప్రణయ్. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో యువకుడిని గ్రామస్థులు అభినందించారు.