News August 29, 2025
ఇచ్చోడ: ఓటర్ ఐడిలో మార్పులు.. నిందితులకు రిమాండ్: సీఐ

ఓటరు ఐడి నుంచి ఓట్లను వేరే గ్రామానికి మార్చిన ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు ఇచ్చోడ సీఐ రాజు తెలిపారు. అడేగామబికి చెందిన మాజీ సర్పంచి వనిత, భర్త సుభాశ్ ఓట్లను కొందరు రెవెన్యూ అధికారి సహాయంతో వేరే గ్రామానికి మార్చారన్నారు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులు విశాల్, అచ్యుత్, ధనరాజ్, రెవెన్యూ ఆర్ఐ హుస్సేన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Similar News
News August 29, 2025
మన్నూర్ కిడ్నాప్ కేసులో ఆరుగురి అరెస్ట్

గుడిహత్నూర్ మండలంలో కిడ్నాప్ కలకలం రేపింది. మన్నూర్‌కు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ శివ ప్రసాద్‌ను 26వ తేదీన రాత్రి కొంతమంది కిడ్నాప్ చేసి ఇచ్చోడ వైపు తరలించారు. సమాచారం అందుకున్న పోలీస్‌లు సెల్ లొకేషన్ ఆధారంగా అతడిని రక్షించారు. విచారణలో వ్యక్తిగత వైరం కారణంగా ఈ కిడ్నాప్ చేసినట్లు సీఐ రాజు తెలిపారు. నిందితులు సురేశ్, రవి, వెంకటి, పరేశ్వర్, నామదేవ్, గజనంద్‌ను రిమాండ్‌కు తరలించామన్నారు.
News August 28, 2025
సీఐ ని పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్

జైనథ్ సీఐ సాయినాథ్‌ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శించారు. డొలారా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీఐ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం ఆస్పత్రికి వెళ్లి సీఐ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దగ్గరుండి పలు వైద్య పరీక్షలను చేయించారు. సీఐతో పాటు గాయపడ్డ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
News August 28, 2025
సీఐ, డ్రైవర్ పరిస్థితిపై ఎస్పీ అరా

ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జైనథ్ మండలంలోని డొలారా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జైనథ్ సీఐ సాయినాథ్, డ్రైవర్ పరిస్థితిపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆరా తీశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, డ్రైవర్‌ను ఎస్పీ స్వయంగా వెళ్లి పరామర్శించారు. డాక్టర్‌తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి ఉన్నారు.