News March 28, 2025
ఇచ్చోడ: ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడి మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన ఇచ్చోడలోని నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. SI పోలీసుల వివరాలు.. బోథ్ మండలం సాకేరాకి చెందిన ధనుశ్(12) తల్లి లక్ష్మితో కలిసి బుధవారం బంధువుల ఇంటికి ఫంక్షన్‌కు వచ్చాడు. గురువారం ఉదయం తోటి పిల్లలతో కలిసి ఊరి బయట ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోవడంతో మృతి చెందాడు. తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
Similar News
News March 31, 2025
ADB: గ్రూప్-1లో అమరేందర్‌కు 149 ర్యాంకు

గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ప్రతిభ కనబరిచారు. స్థానిక దోబీ కాలనీకి చెందిన బండి అశోక్- లక్ష్మి దంపతుల కుమారుడు బండి అమరేందర్ 478.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 149 ర్యాంకు సాధించారు. మల్టీ జోన్- 1లో 76వ ర్యాంకు సాధించారు. గ్రూప్-1లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 31, 2025
ఆదిలాబాద్: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.
News March 31, 2025
నార్నూర్: వచ్చే నెలలో పెళ్లి.. ఉగాది రోజే మృతి

నార్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన పవార్ సంగీత-ఉత్తమ్ దంపతుల కుమారుడు పవార్ శంకర్(22) ఆదివారం కెరమెరిలోని శంకర్ లొద్ది పుణ్య క్షేత్రానికి వెళ్లి వాగులో <<15940359>>ఈతకు వెళ్లి<<>> మృతిచెందాడు. శంకర్ ఉగాది రోజే మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా ఏప్రిల్‌లో అతడికి పెళ్లి నిర్ణయించినట్లు స్థానికులు తెలిపారు.