News March 6, 2025

ఇచ్ఛాపురం: మద్యం దుకాణాలకు ఎంపిక నేడు

image

ఇచ్చాపురం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మద్యం దుకాణాలకు అభ్యర్థులను గురువారం రోజున లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సీఐ దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా.. జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కాలేజీ రోడ్డు అంబేడ్కర్ ఆడిటోరియంలో ఉ.8 గం.లకు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వారు ఎంట్రీపాస్, ఆధార్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ తేవాలన్నారు.

Similar News

News March 6, 2025

శ్రీకాకుళం: 18 షాపులు కేటాయింపు

image

పారదర్శకంగా లాటరీ పద్ధతిలో 18 బ్రాందీ షాపులు కేటాయించినట్లు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. గురువారం శ్రీకాకుళం అంబేడ్కర్ ఆడిటోరియంలో లాటరీ పద్ధతిలో గీత కార్మికులకు, సొండి కులస్థులు సమర్పించిన ధ్రువపత్రాల ప్రకారం ఆయా కేటగిరిలో కేటాయించామన్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

News March 6, 2025

ఆమదాలవలసలో భారీ లారీ బీభత్సం

image

ఆమదాలవలస మండలం తిమ్మాపురం గ్రామం దగ్గర బుధవారం లారీ బీభత్సం సృష్టించింది. పాలకొండ రోడ్డులో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉండే కిరాణా షాప్స్ మీదకి దూసుకెళ్లింది. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కిరాణా షాపుల ఫ్లెక్సీ బోర్డులు పూర్తిగా ధ్వంసమయ్యాయి . లారీ డ్రైవర్ మద్యం తాగి నడిపినట్లు షాపు యజమాని చెబుతున్నాడు.

News March 6, 2025

వజ్రపుకొత్తూరు: రిటైర్ట్ తెలుగు టీచర్ మృతి

image

వజ్రపుకొత్తూరు పూండి గోవిందపురానికి చెందిన రిటైర్డ్ తెలుగు టీచర్, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ తెలికిచెర్ల ప్రసాదరావు బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన పూండి పరిసర ప్రాంతాలలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారని గ్రామస్థులు తెలిపారు. ఆయన మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. 

error: Content is protected !!