News May 6, 2024
ఇచ్ఛాపురం: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
ఇచ్ఛాపురం పట్టణ పరిధిలోని పెద్దాకుల వీధికి చెందిన శ్రీదేవి సుష్మల్(43) మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఇచ్ఛాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ నడుపుకుంటున్న శ్రీదేవి ఇంట్లో చిన్నచిన్న తగాదాలతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
Similar News
News November 5, 2024
REWIND: టెక్కలిలో బాంబు పేలుడు ఘటనకు మూడేళ్లు
టెక్కలి కచేరివీధిలో బాంబు పేలుడు ఘటనకు మూడేళ్లు అయ్యింది. 2021 నవంబర్ మాసంలో దీపావళి సందర్భంగా టెక్కలికి చెందిన ఎస్.సాయిగోపాల్, వీ.హరి, ఎస్.మూర్తి అనే ముగ్గురు స్నేహితులు ఒక ఇంటి ఆవరణలో దీపావళి చేతిబాంబులు తయారు చేస్తున్న క్రమంలో అప్పట్లో పేలుడు జరిగింది. ఈ ఘటనతో నాడు టెక్కలి ప్రజానీకం ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన యువకులు సుదీర్ఘకాలం చికిత్స అనంతరం కోలుకుని ప్రాణాలతో బయట పడ్డారు.
News November 5, 2024
శ్రీకాకుళంలో కోర్టు కేసులు త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్
వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఏపీసేవా, మీసేవ, పీజీఆర్‌ఎస్ సంబంధించిన రెవెన్యూ, గృహ నిర్మాణ సంస్థ, సీపీవో, రహదారులు, భవనాలు, విద్యా, పంచాయతీ, ఉద్యాన, APEPDCL, డ్వామా, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మీకోసం అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
News November 5, 2024
అపార్ ఐడీ కార్డు నమోదు కీలకం: SKLM కలెక్టర్
శ్రీకాకుళం జిల్లాలో అపార్ ఐడీ కార్డు నమోదుపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆరా తీశారు. మంగళవారం ఆయన ఆ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. DEO తిరుమల చైతన్య జిల్లాలో నేటికి 60.679 శాతం పూర్తి చేశామన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపార్ ఐడీ కార్డు వెబ్‌సైట్లో విద్యార్థుల ఆధార్ కార్డుతో పాటు పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. అపార్ ఐడీ కార్డు విద్యార్థులకు చాలా కీలకమన్నారు.