News February 17, 2025
ఇచ్ఛాపురం: శుభకార్యానికి వెళ్లొస్తూ వ్యక్తి మృతి

ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామానికి చెందిన రంగాల కృష్ణారెడ్డి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు వివరాల మేరకు.. ధర్మపురం గ్రామంలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ట్రాక్టర్‌ను తప్పించబోయి బైక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.
Similar News
News December 31, 2025
ఎచ్చెర్ల: అంబెడ్కర్ యూనివర్సిటీ క్యాలెండర్ ఆవిష్కరణ

రానున్న నూతన సంవత్సరం వర్శిటీ వర్గాలకు, అనుబంధ కళాశాలలకు, ఉన్నత విద్యారంగానికి మరింత శుభ సూచికంగా ఉంటూ ప్రగతి ఫలాలు అందించాలని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వీసి రజని అన్నారు. 2026 నూతన సంవత్సరానికి సంబంధించి డా.బీఆర్‌ఏయూ ముద్రించిన క్యాలండర్, డైరీలను తన ఛాంబర్లో మంగళవారం వర్శిటీ ఉన్నతాధికారులతో కలసి వీసీ ఆవిష్కరించారు. క్యాలెండర్ లో పొందుపరిచిన అంశాలు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు.
News December 30, 2025
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 57 అర్జీలు

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా పిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు విన్నారు. మొత్తం 57 అర్జీలు స్వీకరించామన్నారు.
News December 29, 2025
శ్రీకాకుళం: ముక్కోటి ఏకాదశి.. ముస్తాబైన వైష్ణవ ఆలయాలు

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగరంలోని వైష్ణవాలయాలు ఆధ్యాత్మిక శోభతో ముస్తాబయ్యాయి. అరసవిల్లి, శ్రీకూర్మం, నారాయణ తిరుమల ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశారు.


